Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’

ఢిల్లీలో ప్రారంభించిన ఆప్ పార్టీ యాత్ర జాతీయ పార్టీగా మారి పంజాబ్ లో సీఎం పీఠాన్ని దక్కించుకుంది. ఈ క్రమంలో పంజాబ్ తరువాత ఆప్ టార్గెట్ అంతా గుజరాత్ పైనే ఉంది అని తెలిపింది.

Aam Aadmi party : పంజాబ్ పీఠం దక్కింది..ఇక గుజరాత్ పై గురి పెట్టిన ‘ఆప్’

Aam Aadmi Party next Target Is Gujarat

Aam Aadmi party Next target is Gujarat :  స్థానిక పార్టీలను ఊడ్చి పారేసి అంచనాలకు మించి పంజాబ్ ను కైవశం చేసుకుంది విజయం సాధించింది ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్). ఆప్ తదుపరి టార్గెట్ గుజరాత్ అంటూ తెలిపింది. పార్టీ స్థాపించాక ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న పార్టీ నెమ్మదిగా జాతీయ పార్టీగా ఆవిర్భవించి తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్ లో విజయం సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. ఈక్రమంలో ఇక ఆప్ మరింత ఉత్సాహంగా ప్రధాని మోడీ అడ్డా గుజరాత్ ను కూడా దక్కించుకుంటాం అంటూ తెలిపింది.

Also read : AAP Punjab : పంజాబ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన ఆప్‌.. జాతీయ పార్టీలను ఊడ్చి పారేసిన ‘చీపురు’

తొలుత ఢిల్లీ.. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు గుజరాత్ పై కన్నేసింది. ఈ ఏడాది చివర్లో గుజరాత్ లో ఎన్నికలు రానున్నాయి. దీంతో గుజరాత్ లో పాగా వేసేందుకు ఆప్ ఇప్పుడు సన్నాహాలు మొదలు పెట్టింది. ట్విట్టర్ లో ఇందుకు సంబంధించి ఆప్ ఒక ట్వీట్ వేసింది. అందులో.. ‘‘ఢిల్లీ, పంజాబ్ తర్వాత.. ఇప్పుడు గుజరాత్ ఆప్ ను కోరుకుంటోంది’’అని పేర్కొంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో ఆప్ పంజాబ్ లో విజయం సాధించింది. సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించి మరీ ఎన్నికల బరిలో నిలిచింది. గెలిచింది. ఈ గెలుపులో స్థానిక పార్టీలను తుడిచిపారేసింది. విజయాన్ని సాధించింది.

Also read : AAP : హేమాహేమీలను ఓడించిన లాభ్ సింగ్, జీవన్ జ్యోత్ కౌర్ ఎవరు ? నెటిజన్ల ఆసక్తి

తొలుత ఢిల్లీ.. తాజాగా పంజాబ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పుడు గుజరాత్ పై కన్నేయటమే కాదు ఆ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. 2022 చివర్లో గుజరాత్ లో ఎన్నికలు రానున్నాయి. దీంతో గుజరాత్ లో పాగా వేసేందుకు ఆప్ ఇప్పుడు సన్నాహాలు మొదలు పెట్టింది. ట్విట్టర్ లో దీనికి సంబంధించి ఆప్ ఒక ట్వీట్ వేసింది. ఆ ట్వీట్ లో ‘‘ఢిల్లీ, పంజాబ్ తర్వాత..ఆప్ ఇప్పుడు గుజరాత్ కోరుకుంటోంది’’అని పేర్కొంది.

Also read : Russia China: రష్యాకు విమాన పరికరాలను నిలిపివేసిన చైనా: భారత్ కు కలిసొచ్చే అవకాశం

ట్వీట్ లో పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఫొటో తో పోస్టర్ కూడా కనిపిస్తోంది. 2022 ఏప్రిల్ లో గుజరాత్ రాష్ట్రంలో ఆప్ తిరంగా యాత్రను మొదలు పెట్టనుంది. అన్ని మండలాలు, పంచాయతీల పరిధిలో ఇది ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ తో పాటు, పంజాబ్ సీఎంగా ప్రమాణం చేయనున్న భగవంత్ మాన్ కూడా త్వరలో గుజరాత్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.