Sarath Babu : శరత్ బాబు సినీ ప్రయాణం.. IPS అవ్వాలి అనుకొని!
శరత్ బాబుకి సినీ రంగం వైపు వచ్చే ఆలోచనే లేదట అసలు. చిన్నప్పటి నుంచి IPS అవ్వాలని కల్లలు కన్నారట. కానీ..

actor Sarath Babu want to be a IPS not a actor story in telugu
Sarath Babu : గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు.. బెంగళూరులో చికిత్స పొందుతూ వస్తున్నారు. ఏప్రిల్ 21 నాడు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఆయన కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం బెంగళూరు నుంచి హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతూ వస్తున్న శరత్ బాబు.. మల్టీ ఆర్గాన్స్ పూర్తి గా డ్యామేజ్ అవ్వడంతో నేడు (మే 22) కన్ను మూశారు.
Sarath Babu : సీనియర్ నటుడు శరత్ బాబు కన్నుమూత..
తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ్, హిందీ భాషల్లో 220 కి పైగా సినిమాల్లో నటించిన శరత్ బాబు.. అసలు నటుడు అవ్వాలనే అనుకోలేదట. చిన్నప్పటి నుంచి IPS అవ్వాలని కల్లలు కన్నారట. కానీ అనుకోకుండా సినీ రంగం వైపు ఆయన ప్రయాణం మలుపు తిరిగిందని శరత్ బాబు అనేకసార్లు చెప్పుకొచ్చారు. కాలేజీ చదువుతున్న సమయంలో ఎన్నో స్టేజిలపై డ్రామాల్లో నటించిన శరత్ బాబు.. 1973లో ‘రామరాజ్యం’ సినిమాలో హీరోగా నటించి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
Music director Raj : ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత
ఆ తరువాత ఏ మాత్రం ఆలోచించకుండా రెండు సినిమాల్లో విలన్ గా కనిపించి అందర్నీ ఆకట్టుకున్నారు. అప్పటి నుంచి హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ వచ్చిన శరత్ బాబు.. 8 నంది అవార్డులను సైతం అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా మూడు సార్లు నంది అవార్డుని అందుకున్నారు. మరో చరిత్ర, గుప్పెడు మనసు, శృంగార రాముడు, ఇది కథ కాదు, 47 రోజులు, సీతాకోక చిలక, సితార, అన్వేషణ, స్వాతిముత్యం, సాగరసంగమ, సంసారం ఒక చదరంగం, క్రిమినల్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
చివరిగా ఆయన నటించిన సినిమా నరేష్, పవిత్రల నటించిన తెలుగు సినిమా ‘మళ్ళీ పెళ్లి’. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన శరత్ బాబు.. అక్కడ నటించిన చివరి మూవీ బాబీ సింహ ‘వసంత ముల్లై’. సినిమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ కూడా నటించారు. ఇక శరత్ బాబు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.