Genelia : హహా.. హాసిని మళ్ళీ వస్తోంది.. ఫ్రెండ్ సినిమాతో రీ ఎంట్రీ..

నటీనటులకు రీ ఎంట్రీ అనేది ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది.. ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న నటీమణులు అత్త, అక్క, వదిన పాత్రలతో అదరగొడుతున్నారు..

Genelia : హహా.. హాసిని మళ్ళీ వస్తోంది.. ఫ్రెండ్ సినిమాతో రీ ఎంట్రీ..

Genelia

Genelia: నటీనటులకు రీ ఎంట్రీ అనేది ఎప్పుడూ స్పెషల్‌గానే ఉంటుంది.. ఇప్పటికే పలువురు ఆర్టిస్టులు సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. పెళ్లి తర్వాత గ్యాప్ తీసుకున్న నటీమణులు అత్త, అక్క, వదిన పాత్రలతో అదరగొడుతున్నారు.

Genelia

ఇప్పుడు మరో హీరోయిన్ తెలుగు సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతోందని సమాచారం.. హహా హాసిని అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన జెనీలియా త్వరలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చెయ్యనుంది. బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్‌తో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది.

Genelia

ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత పూర్తిగా కుటుంబానికి టైం కేటాయించిన జెనీలియా త్వరలో తన ఫ్రెండ్ ఉస్తాద్ రామ్ పోతినేని సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వనుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకుముందు రామ్, జెనీలియా ‘రెడీ’ మూవీలో నటించారు.

Genelia