TV Actress Mythili: నా భర్తను కఠినంగా శిక్షించాలి: మైథిలీ రెడ్డి

తన భర్త శ్రీధర్ రెడ్డికి పెళ్లికి ముందు నుంచే మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో సంబంధం ఉందని, ఆమె విషయంలో తనను భర్త తరచూ కొట్టేవాడని ఆరోపించింది టీవీ నటి మైథిలీ రెడ్డి. తనను మోసం చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది.

TV Actress Mythili: నా భర్తను కఠినంగా శిక్షించాలి: మైథిలీ రెడ్డి

Tv Actress Mythili

TV Actress Mythili: తన భర్త శ్రీధర్ రెడ్డికి పెళ్లికి ముందు నుంచే మహా అలియాస్ రజిత అనే అమ్మాయితో సంబంధం ఉందని, ఆమె విషయంలో తనను భర్త తరచూ కొట్టేవాడని ఆరోపించింది టీవీ నటి మైథిలీ రెడ్డి. తనను మోసం చేసిన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. రెండు రోజుల క్రితం టీవీ నటి మైథిలీ రెడ్డి ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తన ఆత్మహత్యాయత్నం గురించి పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులు మైథిలిని ఆసుపత్రికి తీసుకెళ్లారు.

Maggi Noodles: రోజూ మ్యాగీ చేసిపెట్టిన భార్య.. విడాకులిచ్చిన భర్త

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైథిలి.. తన ఆత్మహత్యకు గల కారణాలను 10టీవీకి వివరించింది. ‘‘మాది పెద్దలు కుదిర్చిన వివాహం. భర్త శ్రీధర్ రెడ్డి టీవీలో ఒక ప్రోగ్రాం డైరెక్టర్. ఇద్దరికీ సెకండ్ మ్యారేజ్. అప్పటికే నాకు ఒక బాబు ఉన్నాడు. పెళ్లికి ముందు మంచి వాడులా నటించాడు. మనకి ఇక పిల్లలు వద్దు.. ఈ బాబునే కొడుకులా చూసుకుంటా అన్నాడు. పెళ్లైన కొద్ది నెలల్లోనే అన అసలు రంగు బయటపెట్టాడు. కట్నం డబ్బు, కార్లు, బంగారం.. ఇలా ప్రతి విషయంలోనూ అబద్ధాలే చెప్పాడు. 65 తులాల బంగారం దొంగతనం చేశాడు. తనకు పెళ్లికి ముందే రజిత అనే యువతితో సంబంధం ఉంది. ఆమెను ఒకసారి ఫ్రెండ్ అనేవాడు.. ఇంకోసారి చుట్టాలమ్మాయి అనేవాడు. ఈ విషయంలో ఇద్దరిమధ్యా గొడవలు కూడా జరిగాయి. ఆమె విషయంలో నన్ను కొట్టేవాడు. ఆమె చాలాసార్లు ఇంటికొచ్చి మా ఇద్దరిమధ్య గొడవలు పెట్టేది. దీంతో తనపై మోతె పోలీస్ స్టేషన్‌లో 498 సెక్షన్ కింద కేసు పెట్టాము. 2021లో పంజాగుట్టలో ఇంకో కేసు పెట్టా. అయితే, పంజాగుట్ట పోలీస్‌లు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

WhatsApp: మెసేజ్ పంపాక కూడా ఎడిట్ చేసుకునే ఆప్షన్..

శ్రీధర్ రెడ్డికి పీసీసీ మహిళా అధ్యక్షురాలు సునీత రావు సపోర్ట్ ఉంది. భర్తే నన్ను మోసం చేసాడు. దాదాపు రెండేళ్లుగా ఆయన నాతో ఉండట్లేదు. నాకు తెలీకుండానే విడాకులకు అప్లై చేసాడు. పిల్లలు ఉన్నారని ఇన్ని రోజులు అన్నీ భరించాను. నాకు ఇక మానసికంగా ధైర్యం సరిపోలేదు. ఆ బాధను తట్టుకోలేకే పంజాగుట్ట పోలీసులకు పోన్‌ చేశాను. తర్వాత సూసైడ్ అటెంప్ట్‌ చేశాను. నాకు తగిన న్యాయం కావాలి. మోసం చేసిన నా భర్తను శిక్షించాలి’’ అని మైథిలి చెప్పింది.