Addanki Dayakar: ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారు

కాంగ్రెస్‌లో చేరేందుకు ఈటల రాజేందర్ తొలుత రేవంత్‌రెడ్డి‌తో సంప్రదింపులు జరిపాడు. కానీ, వ్యాపారాలు కాపాడుకోవడానికి బీజేపీ‌లోకి పోయిండని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు.

Addanki Dayakar: ఈటల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతారు

Addanki Dayakar

Addanki Dayakar: తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో కనిపిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ అన్నారు. గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ బలపడుతుందనే భయం బీజేపీ నేతల్లో కనిపిస్తుంది. విపక్షాలు ఏకమయ్యి పోరాడాల్సిన పరిస్థితి నుంచి విచ్ఛిన్నం అయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బీజేపీలో చేరికలు లేక ఫ్రస్టేషన్‌కు గురవుతున్నారు. ఢాంబికాలు చెప్పుకుని బీజేపీ‌లో చేరారు. 18వేల కోట్లుపెట్టి రాజగోపాల్ రెడ్డిని కొన్నారంటూ అద్దంకి ఆరోపించారు. మునుగోడు ఎన్నికలపై ఈటల ఆరోపణలు నిజమైతే రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు.

Revanth Reddy : రూ.25కోట్ల లొల్లి.. దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయానికి రా-ఈటలకు రేవంత్ రెడ్డి సవాల్

మోదీ, అమిత్ షా‌ దగ్గర మార్కులు కొట్టేసేందుకే ఈటల ఇష్టారీతిలో ఆరోపణలు చేశాడని, ఆయనకు దమ్ముంటే భాగ్యలక్ష్మి ఆలయం వచ్చి ప్రమాణం చేయాలని అద్దకి సవాల్ చేశారు. తెలంగాణలో చర్చకోసం ఈటల తాపత్రయ పడుతున్నారని, బీజేపీని లేపడానికి కేసీఆర్ పనిగట్టుకుని పనిచేస్తున్నారంటూ అద్దంకి అన్నారు. ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ బీజేపీ‌కి హైప్ ఇస్తున్నాడని, బీజేపీ‌కి చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్‌పై పోరాడాలని సవాల్ చేశారు. సహారా కుంభకోణం‌లో కేసీఆర్‌పై ఎందుకు కేసు కొట్టేశారని ప్రశ్నించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ‌లో జరిగిన అవినీతి‌పై బీజేపీ స్టాండ్ ఏమిటని అద్దంకి ప్రశ్నించారు. రూ.18వేల కోట్లు వచ్చాయని రాజగోపాల్ రెడ్డి తానే స్వయంగా చెప్పారన్న అద్దంకి.. ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ ఎంతకు తీసుకుందని ప్రశ్నించారు. కర్ణాటకలో జేడీఎస్, ఎంఐఎం కలయిక వెనక బీజేపీ, బీఆర్ఎస్ ఉందని అద్దంకి ఆరోపించారు.

Vijayashanthi : మీరు పరస్పర విమర్శలు చేసుకోకుండా ప్రభుత్వంపై పోరాడాలి.. రేవంత్, ఈటలకు విజయశాంతి సూచనలు

కాంగ్రెస్‌లో చేరేందుకు ఈటల తొలుత రేవంత్‌రెడ్డి‌తో సంప్రదింపులు జరిపారని, కానీ, వ్యాపారాలు కాపాడుకోవడానికి బీజేపీ‌లోకి పోయిండని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్‌లోనే ఉంటాడని అద్దంకి దయాకర్ అన్నారు. రాజగోపాల్ రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని అప్రతిష్ట‌పాలు చేస్తున్నారని విమర్శించారు. ఈటెల భాగ్యలక్ష్మి టెంపుల్‌కు రాకుంటే రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోతాడంటూ అద్దంకి ఘాటుగా విమర్శించారు.

CM Jagan-Ramakrishna : రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్, సీపీఐ నేత రామకృష్ణ

టీపీసీసీ అధికార ప్రతినిధి సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కొన్ని వందల కోట్లు ఖర్చుపెట్టి ఈటల గెలిచారు. లెఫ్టిస్ట్ అయిన ఈటల రైటిస్ట్‌గా, మరో కేసీఆర్‌లాగా మారారు. రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేస్తే బీజేపీలో పదవి వస్తుందని ఈటల భావిస్తున్నారు. దేవాలయ భూములను కొల్లగొట్టిన ఈటల కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అంటూ సుధీర్ కుమార్‌రెడ్డి విమర్శించారు. ఈటలపై ఉన్న కేసులపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈటలకు చిత్తశుద్ధి వుంటే భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దకు రావాలి, తన విలువలను కాపాడుకోవాలని సుధీర్ కుమార్ అన్నారు.