Vijayashanthi : మీరు పరస్పర విమర్శలు చేసుకోకుండా ప్రభుత్వంపై పోరాడాలి.. రేవంత్, ఈటలకు విజయశాంతి సూచనలు

బీఆర్ఎస్‌తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపైమరొకరు చేసుకోవడం సరికాదన్నారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని చెప్పారు.

Vijayashanthi : మీరు పరస్పర విమర్శలు చేసుకోకుండా ప్రభుత్వంపై పోరాడాలి.. రేవంత్, ఈటలకు విజయశాంతి సూచనలు

Vijayashanthi

Updated On : April 22, 2023 / 12:50 PM IST

Vijayashanthi : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరస్పర విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ కు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి పలు సూచనలు చేశారు. నిరంతర తెలంగాణ ఉద్యమకారిణిగా ప్రజల అభిప్రాయం చెప్పడం ఈ సందర్భంలో తన బాధ్యత అన్నారు.

బీఆర్ఎస్‌తో పోరాడే తమ్ముళ్లు రేవంత్, ఈటల తమ దాడిని ఒకరిపైమరొకరు చేసుకోవడం సరికాదన్నారు. ఎవరి ధోరణిలో వారు ప్రభుత్వంపై పోరాడటం అవసరమేమో అనిపిస్తుందని చెప్పారు. ఈ సందర్భంలో కొంచెం ఆలోచించాలని సూచించారు. తెలంగాణ ప్రస్తుత పరిస్థితులపై సంపూర్ణ అవగాహన ఉన్న ఇద్దరికీ చెప్పడం తన బాధ్యత అన్నారు.

Vijayashanthi Comments BRS : ప్రజలను దోచుకుంటున్న బీఆర్ఎస్ ప్రభుత్వం : బీజేపీ నేత విజయశాంతి

దేశంలోనే అత్యంత ధన ప్రభావిత ఎన్నికల కార్యాచరణ తెలంగాణలో కొనసాగుతోందని పేర్కొన్నారు. ఇది మన తెలంగాణ రాజకీయ కార్యకర్తలందరూ గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తున్న వాస్తవమని తెలిపారు. ఇందుకు కారణంగా ఉన్న అసలైన దుర్మార్గ వ్యవస్థపై పోరాడ వలసిన కర్తవ్యం మనకు తప్పనిసరిగా ఉందనేది నిజమని పేర్కొన్నారు.

ఈ విధానాన్ని అధికార పార్టీ ప్రజాస్వామ్య హనన రాజకీయ దుష్కృత్య ధోరణులపై కాక, ప్రతిపక్షాల నేతలు పరస్పరం చేసుకునే మాటల, సవాళ్ల దాడులు, బీఆర్ఎస్‌కు వేడుకలవుతున్నాయని విజయశాంతి చెప్పారు.