Deodorant Adds: ఆ వీడియోలు తొలగించండి.. ట్విటర్, యూట్యూబ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ట్విటర్, యూట్యూబ్ లకు లేఖ రాసింది. ఆ వీడియోలను తొలగించాలని ఆ లేఖలో సూచించింది. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయాలు చేసే క్రమంలో వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో పలు ప్రకటనలు అశ్రీలతతో పాటు స్త్రీలపై ద్వేష పూరితంగా, అత్యాచారాలను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి.

Deodorant Adds: ఆ వీడియోలు తొలగించండి.. ట్విటర్, యూట్యూబ్‌లకు కేంద్రం కీలక ఆదేశాలు

Controversial Deodorant

Deodorant Adds: కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ట్విటర్, యూట్యూబ్ లకు లేఖ రాసింది. ఆ వీడియోలను తొలగించాలని ఆ లేఖలో సూచించింది. పలు కంపెనీలు తమ ఉత్పత్తులను విక్రయాలు చేసే క్రమంలో వాణిజ్య ప్రకటనలు ఇస్తుంటాయి. ఈ క్రమంలో పలు ప్రకటనలు అశ్రీలతతో పాటు స్త్రీలపై ద్వేష పూరితంగా, అత్యాచారాలను ప్రోత్సహించే విధంగా ఉంటున్నాయి. ముఖ్యంగా బాడీ స్ప్రే ప్రకటనలు ఎక్కువగా ఈ తరహా విధానాన్ని పోలినట్లుగా కనిపిస్తున్నాయి. తాజాగా భారత్ కు చెందిన పర్ ఫ్యూమ్, డియోడ్రంట్, స్ప్రే ఉత్పత్తిదారు లేయర్స్ కంపెనీ తన ఉత్పత్తుల ప్రచారానికి సంబంధించి తాజాగా రూపొందించిన రెండు యాడ్స్ పై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. యువతలను అగౌరపరిచేలా, కించపర్చేలా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. అత్యాచార సంస్కృతిని పెంపొందించేలా యాడ్స్ ఉన్నాయని చాలా మంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

మాస్ మీడియాలో స్త్రీ ద్వేషపూరిత ప్రకటనలను ప్రసారం చేయొద్దని కోరుతూ ఢిల్లీ మహిళా కమిషన్ కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు లేఖ రాసింది. ఫెర్ఫ్యూమ్ బ్రాండ్ లేయర్స్ షాట్ పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో భగ్గుమనడంతో ఈ తరహా ప్రకటనలపై వివాదం రేగింది. ఈ ప్రకటన గ్యాంగ్ రేప్ సంస్కృతిని ప్రోత్సహించేలా ఉందని మహిళా కమీషన్ పేర్కొంది. అంతేకాదు ఈ విషయంపై తక్షణం విచారణ జరపాలంటూ ఢిల్లీ పోలీస్ శాఖను సైతం ఆదేశించింది. ఈ నేపథ్యంలో సదరు వాణిజ్య ప్రకటనకు సంబంధించి కేంద్ర ప్రసార శాఖకు కమీషన్ లేఖ రాసింది. ఈ ప్రకటనను తక్షణమే నిషేధించేలా చర్యలు తీసుకోవాలని కమీషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం మహిళలపై లైంగిక దాడులను ప్రేరేపించేలా ఉంటున్న వాణిజ్య ప్రకటనలకు అడ్డుకట్ట వేయడంపై దృష్టి సారించింది. తమతమ సామాజిక మాధ్యమ వేదికల నుంచి అటువంటి ప్రకటనలను తొలగించాలంటూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ శనివారం ట్విట్టర్‌, యూట్యూబ్‌లకు లేఖలు రాసింది. కొన్ని పరిమళ ద్రవ్యాల (పర్‌ఫ్యూమ్స్‌) ప్రకటనలు సామూహిక అత్యాచారాల సంస్కృతిని పెంచేలా ఉంటున్నాయని, వాటిని తొలగించాలని సూచించింది.

Pacific Ocean: ఫసిపిక్ మహా సముద్రంలో బిడ్డకు డెలివరీ, ఏ వైద్యులు లేకుండానే..

మర్యాద, నైతికతలను దెబ్బతీసేలా మహిళలను చిత్రీకరిస్తున్న ఆ వీడియోలు మీడియా నియమాలను ఉల్లంఘించడం కిందికే వస్తాయని లేఖల్లో పేర్కొంది. కొన్నిపర్ ఫ్యూమ్ కంపెనీల ప్రకటనలపై సామాజిక మాధ్యమాల వినియోగదారులు సైతం పెద్దఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రిత్వశాఖ గుర్తు చేసింది. అనుచితంగా, అవమానకరంగా ఉంటున్నడీవోడరెంట్‌ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోందని, ఈ ప్రకటనను తక్షణం తొలగించాలని కేంద్ర మంత్రిత్వశాఖ కోరిందని ఆశాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. అడ్వర్టయిజ్‌మెంట్‌ స్టాండర్డ్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌సీఐ) సైతం ప్రకటనల తీరుపై ఓ కన్నేసి ఉంచాలని, మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నవాటిని తక్షణ ప్రాతిపదికన ఉపసంహరించుకునేలా ప్రకటనకర్తలను కోరాలని కేంద్ర మంత్రిత్వశాఖ తన లేఖలో పేర్కొంది.