Rahul Gandhi : మరో షాక్.. రాహుల్ ఇన్​స్టాగ్రామ్ ఖాతా కూడా బ్లాక్!

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ఇప్పటికే బ్లాక్ కాగా..త్వరలో రాహుల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఇన్​స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR)​ఫేస్​బుక్​ని ఓ లేఖలో ఆదేశించింది.

Rahul Gandhi : మరో షాక్.. రాహుల్ ఇన్​స్టాగ్రామ్ ఖాతా కూడా బ్లాక్!

Rahul (1)

Rahul Gandhi కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతా ఇప్పటికే బ్లాక్ కాగా..త్వరలో రాహుల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ కూడా బ్లాక్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాహుల్ గాంధీ ఇన్​స్టాగ్రామ్ ఖాతాపై చర్యలు తీసుకోవాలని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(NCPCR)​ఫేస్​బుక్​ని ఓ లేఖలో ఆదేశించింది. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీలో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబ సభ్యుల వివరాలు బహిర్గతమయ్యేలా.. రాహుల్ పోస్ట్ చేసినందుకుగాను ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఫేస్ బుక్ కి రాసిన లేఖలో NCPCR పేర్కొంది.

ఫేస్​బుక్​కు NCPCR రాసిన లేఖలో ఏముంది
ఇన్​స్టాగ్రామ్​లో రాహుల్​ పోస్టు చేసిన ఓ వీడియోలో బాధిత బాలిక కుటుంబాన్ని గుర్తించేలా ఉంది. ఆ వీడియోలో బాలిక తల్లితండ్రులు స్పష్టంగా కనిపిస్తున్నారు. ఇది నిర్దేశించిన చట్టాలను ఉల్లంఘించడమే. జువైనల్​ జస్టిస్​ యాక్ట్​-2015, పోక్సో చట్టం-2012, ఐపీసీలోని నిబంధనలను ఉల్లంఘించినందుకుగాను రాహుల్ ఇన్​స్టాగ్రామ్ అకౌంట్ పై చర్యలు తీసుకోవాలి. సదరు వీడియోను వెంటనే తొలగించాలి అని ఫేస్​బుక్​కు రాసిన లేఖలో ఎన్​సీపీసీఆర్​ పేర్కొంది.

NCPCR చీఫ్ ప్రియాంక్ కనూంగో

ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ ఆ వీడియోను అప్‌లోడ్ చేయడంపై ఇవాళ ఫిర్యాదు అందుకున్నాం. రాహుల్ అప్ లోడ్ చేసిన వీడియో.. బాధిత బాలిక((ఢిల్లీలోని నంగల్‌లో అత్యాచారానికి గురైన మైనర్ బాలిక) తల్లిదండ్రుల గుర్తింపును వెల్లడించింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలని ఫేస్​బుక్​కు లేఖ రాశాం. మూడు రోజుల్లోగా రిప్లై ఇవ్వాలపి వారిని కోరాం. ఆ వ్యవధి ఈ రోజుతో ముగుస్తుంది. మాకు ఫేస్​బుక్​ నుంచి ఇవాళ్టిలోగా సమాధానం రాకపోతే, తాము బాలల హక్కుల పరిరక్షణ చట్టం, 2005 సెక్షన్ 14 ప్రకారం ఫేస్​బుక్ పై చర్యలు తీసుకుంటాము అని ప్రియాంక్ కనూంగో తెలిపారు.

కాగా, ఆగస్ట్ 1న నైరుతి ఢిల్లీలోని ఓ శ్మశానవాటిక వద్ద ఓ దళిత బాలికను రేప్ చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఆగస్టు-2న బాధిత కుటుంబాన్ని రాహుల్ కలిశారు. తన కారులో కూర్చోబెట్టుకుని వారితో మాట్లాడారు. అనంతరం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. వారితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. అయితే, అత్యాచారం కేసుల్లో బాధితుల వివరాలు బయటకు తెలిసేలా వ్యవహరించకూడదు.
దీంతో స్పందించిన ఎన్​సీపీసీఆర్​.. ఆ ట్వీట్​పై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్​కు ఆగస్టు-4న నోటీసులు పంపించింది. దీంతో రాహుల్ షేర్ చేసిన ఫొటోలు, ట్వీట్ ని తొలగించడంతో పాటు ఆయన ట్విట్టర్ అకౌంట్ ని ఆగస్టు-6 నుంచి తాత్కాలికంగా బ్లాక్ చేసింది ట్విట్టర్.