దసరా వరకు స్కూళ్లు తెరిచేది లేదు

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు నెలలు దాటింది. స్కూళ్లు ఎప్పుడు

  • Published By: naveen ,Published On : June 8, 2020 / 09:25 AM IST
దసరా వరకు స్కూళ్లు తెరిచేది లేదు

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు నెలలు దాటింది. స్కూళ్లు ఎప్పుడు

కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండు నెలలు దాటింది. స్కూళ్లు ఎప్పుడు రీఓపెన్ చేస్తారో స్పష్టత లేదు. స్కూల్స్ రీఓపెన్ పై విద్యార్థులు, తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ తిరిగి తెరవడంపై టీఎస్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్ స్పందించారు. ఇప్పట్లో స్కూళ్లు తెరవాలని అనుకోవడం లేదని ఆయన అన్నారు. దసరా వరకు పాఠశాలు తెరిచే ఆలోచన లేదన్నారు. మూడు నెలలు చూసిన తర్వాత స్కూళ్లు తెరవడంపై ఆలోచిస్తామన్నారు. స్కూల్స్ లో భౌతిక దూరం, శానిటైజేషన్ నిబంధనలు పాటించడం చాలా కష్టం అన్నారాయన.  

కాగా, స్కూళ్లు, కాలేజీల రీఓపెన్ పై కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిన్న కామెంట్ చేశారు. ఆగస్టు తర్వాతే స్కూళ్లు, కాలేజీలు రీఓపెన్ చేస్తామని ఆయన చెప్పారు. జూన్ 3న జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయనీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఇండియా టుడే తెలిపింది. ఇంతకు ముందు జరిగిన పరీక్షలతోపాటు ఇప్పుడు నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాలను ఆగస్టు 15లోగా ప్రకటించాలని ప్రయత్నిస్తున్నామని మంత్రి వెల్లడించారు.

కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5 అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి 5వ దశ లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. లాక్ డౌన్ 5 లో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం స్కూళ్లు, కాలేజీలను 30 శాతం అటెండెన్స్‌తో జులైలో రీఓపెన్ చేస్తారని, 8వ తరగతిలోపు స్టూడెంట్స్ ఇళ్ల దగ్గరే ఉంటారని భావించారు. అలాగే గ్రీన్, ఆరెంజ్ జోన్స్‌లోనూ విద్యా సంస్థలు మళ్లీ తెరుస్తారని.. భౌతిక దూరం పాటిస్తూ, తక్కువ అటెండెన్స్‌తో రెండు షిఫ్ట్స్ మధ్య క్లాసుల నిర్వహణ ఉంటుందని అనుకున్నారు. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణ ఓ రేంజ్ లో ఉంది. రోజురోజుకి రికార్డ్ స్థాయిలో వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో విద్యా సంస్థలు రీఓపెన్ చేస్తే పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడేసినట్టు అవుతుంది. దీంతో విద్యా సంస్థల పున: ప్రారంభం ఆలస్యమవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి 15వ తేదీ వరకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్ఈ/ఐఎస్‌సీ ఎగ్జామ్స్ జరగాల్సి ఉండగా.. జులై 26న నీట్, అదే నెల 18 నుంచి 23 వరకు జేఈఈ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

Read: Breaking :GHMCలో కరోనా..ఉద్యోగికి సోకిన వైరస్