Agent : ఏజెంట్ విషయంలో తప్పంతా మాదే.. చిరంజీవి సినిమాలో అది జరగదు.. నిర్మాత ట్వీట్!

ఏజెంట్ రిజల్ట్ తో దర్శక నిర్మాతలు తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర చిరంజీవి సినిమా విషయంలో అది జరగదు అంటూ..

Agent : ఏజెంట్ విషయంలో తప్పంతా మాదే.. చిరంజీవి సినిమాలో అది జరగదు.. నిర్మాత ట్వీట్!

Agent producer Anil Sunkara tweet on chiranjeevi movie

Agent : అక్కినేని అఖిల్ (Akkineni Akhil), సాక్షి వైద్య జంటగా నటించిన సినిమా ఏజెంట్. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి (Mammootty) ఒక ముఖ్య పాత్ర చేశాడు. సురేందర్ రెడ్డి ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ మేకింగ్ లో చాలా లేటు జరిగింది. రీషూట్ లు కూడా జరిగినట్లు వార్తలు వచ్చాయి. సరైన ప్రమోషన్స్ కూడా లేకుండా ఏప్రిల్ 28న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి షోతోనే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకొని అక్కినేని ఫ్యాన్స్ ఆగ్రహాన్ని ఎదురుకుంటుంది చిత్ర యూనిట్.

Bholaa Shankar: అప్పుడు భాషా.. ఇప్పుడు భోళా శంకర్.. సేమ్ సెంటిమెంట్..?

ఈ సినిమాని AK ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై అనిల్ సుంకర నిర్మించాడు. ఇటీవల మూవీ ప్రమోషన్స్ సినిమా విజయం పై అక్కినేని అభిమానులకు ధీమా వ్యక్తం చేశాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అవ్వడంతో నిర్మాత, దర్శకుడు అభిమానులు నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకుంటున్నారు. తాజాగా నిర్మాత అనిల్ సుంకర అభిమానులకు క్షమాపణ చెబుతూ ఒక ట్వీట్ చేశాడు. ఏజెంట్ రిజల్ట్ పూర్తి బాధ్యత మీమే వహిస్తాం అంటూ చెప్పుకొచ్చాడు.

Amala Akkineni: ఏజెంట్ మూవీ ట్రోలింగ్‌పై అమల అక్కినేని కామెంట్.. ఏమన్నారంటే..?

ఇది ఒక పెద్ద రిస్క్ అని తెలిసి కూడా ముందుకు సాగినట్లు, స్క్రిప్ట్ ఒకే చేయడంలోనే పెద్ద మిస్టేక్ చేశామంటూ చెప్పుకొచ్చాడు. ఈ ప్రాజెక్ట్ మేకింగ్ చాలా తప్పులు, ఇబ్బందులు ఎదురయ్యాయని తెలియజేశాడు. అలాని సినిమా ఫెయిల్యూర్ కి రీజన్ చెప్పాలి అనుకోవడం లేదని, తప్పంతా తమదే అని, సినిమా పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒకరికి హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నట్లు వెల్లడించాడు. ఏజెంట్ విషయంలో జరిగిన తప్పులు తమ భవిష్యత్ ప్రాజెక్ట్‌లలో జరగకుండా చూసుకుంటామంటూ చెప్పుకొచ్చాడు. కాగా చిరంజీవి భోళా శంకర్ (Bhola Shankar) సినిమాని ఈ నిర్మాతే ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ చిత్రం వేదాళంకి రీమేక్ గా వస్తుంది.