Akhil Akkineni: అఖిల్ బర్త్‌డే.. సారీ చెప్పిన నిర్మాత!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్....

Akhil Akkineni: అఖిల్ బర్త్‌డే.. సారీ చెప్పిన నిర్మాత!

Agent Producer Says Sorry To Akhil Akkineni Fans

Akhil Akkineni: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను పూర్తి స్పై థ్రిల్లర్ మూవీగా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఏజెంట్ చిత్రం ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం అఖిల్ తనను తాను పూర్తిగా మేకోవర్ చేసుకున్నాడు. ఈ సినిమా కోసం భారీ వర్కవుట్స్ చేసి బీస్ట్ మోడ్‌లోకి ఎంటర్ అయ్యాడు అఖిల్.

Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?

ఇక ఈ సినిమాలో స్పై ఏజెంట్‌గా అఖిల్ పార్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ అంటోంది. అయితే ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా యూనిట్ మాత్రం రఫ్ లుక్ ఉన్న అఖిల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్రంగా అప్‌సెట్ అయ్యారు. అఖిల్ బర్త్ డే సందర్భంగా ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్న టీజర్ ఖచ్చితంగా ఉంటుందని వారు ఆశించారు.

కానీ టీజర్ బదులుగా ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసి చేతులు దులుపుకుంది చిత్ర యూనిట్. ఈ విషయంపై చిత్ర నిర్మాత రామబ్రహ్మం సుంకర ఓ క్లారిటీ ఇచ్చాడు. ఏజెంట్ చిత్ర టీజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. తాము కూడా అఖిల్ బర్త్‌డే కానుకగా టీజర్‌ను రిలీజ్ చేయాలని చాలా ప్రయత్నించినా.. అనుకోని కారణాల వల్ల అది సాధ్యపడలేదని.. అందుకు తమను క్షమించాలంటూ సారీ చెప్పుకొచ్చాడు ఈ చిత్ర నిర్మాత.

Agent: క్రేజీ అప్డేట్.. అఖిల్ ఏజెంట్ లో మలయాళ మెగాస్టార్!

మొత్తానికి అఖిల్ బర్త్‌డే రోజున అభిమానులు, ప్రేక్షకుల కోపాన్ని కంట్రోల్ చేసేందుకు ఏజెంట్ చిత్ర నిర్మాత ఇలా ఓపెన్‌గా సారీ చెప్పడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఇక చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్‌లో ఏజెంట్ మరింత వైల్డ్‌గా, తన స్వాగ్ చూపిస్తూ సిగరెట్ కాలుస్తున్న పోజ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అఖిల్ సరసన సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ యాక్టర్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, వక్కంతం వంశీ ఈ సినిమాకు కథను అందిస్తున్నాడు. ఆగస్టు 12న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.