Congress Party: సమూల మార్పులు దిశగా కాంగ్రెస్ పార్టీ: సంస్థాగత ఎన్నికలపై కసరత్తు

కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు సమావేశంకానున్నారు

Congress Party: సమూల మార్పులు దిశగా కాంగ్రెస్ పార్టీ: సంస్థాగత ఎన్నికలపై కసరత్తు

Aicc

Congress Party: ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీలో అంతర్మధనం మొదలైంది. పార్టీలో సంస్థాగత మార్పులు అవసరమని భావించిన పార్టీ అధిష్టానం ఆదిశగా చర్యలు చేపట్టింది. ఈక్రమంలో కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలపై శనివారం పార్టీ కీలక నేతలు ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇంచార్జిలు సమావేశంకానున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమిని విశ్లేషించుకుంటూ ఇటీవల పార్టీ అధినేత్రి సోనియాను కలిసిన జి-23 నేతల బృందం పలు సూచనలు చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత ఇస్తూ, అధిష్టానం పర్యవేక్షణలో నూతన కార్యవర్గానికి పగ్గాలు అప్పగించేలా సీనియర్ నేతలు సూచనలు చేశారు. ఈక్రమంలో నేడు జరుగుతున్న పార్టీ ఎన్నికల ప్రణాళికపై కాంగ్రెస్ శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.

Also Read:IPL-2022 Matches : నేటి నుంచి ఐపీఎల్ సీజన్ 15 ప్రారంభం.. ఈసారి అన్ని మ్యాచ్​లు భారత్‌లోనే

ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి సోనియాగాంధీ హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. సంస్థాగత ఎన్నికలు, సభ్యత్వ నమోదు కార్యక్రమం సహా ఇతర రాజకీయ అంశాల పై కాంగ్రెస్ నేతలు సుదీర్ఘంగా చర్చించనున్నారు. భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపైనా చర్చించనున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతుందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి. తమ పార్టీ సభ్యత్వం కోరేవారు ఆన్‌లైన్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్ సైట్ లేదా సమీపంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సందర్శించాలని ఏఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.

Also Read:IICT Science Meeting: ఐఐసీటీలో నేటి నుంచి “విజన్ ఇండియా 2047” సమావేశాలు