IICT Science Meeting: ఐఐసీటీలో నేటి నుంచి “విజన్ ఇండియా 2047” సమావేశాలు

శాస్త్రసాంకేతిక మార్పులపై చర్చించి అందుకు ప్రణాళికా బద్దంగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు "విజన్ ఇండియా 2047" సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు

IICT Science Meeting: ఐఐసీటీలో నేటి నుంచి “విజన్ ఇండియా 2047” సమావేశాలు

Iict

IICT Science Meeting: హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ కెమికల్ టెక్నాలజీ “IICT” మరో కీలక సమావేశానికి ఆతిధ్యమిస్తుంది. రానున్న 25 ఏళ్లలో శాస్త్రసాంకేతిక రంగాల్లో చోటుచేసుకోనున్న మార్పుల గురించి అధ్యయనం చేసి ఆయా రంగాల్లో తీసుకోవాల్సిన అభివృద్ధి చర్యలపై చర్చించేందుకు పరిశోధకులు శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. దేశంలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సుమారు 200 పరిశోధనా సంస్థల డైరెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొనన్నునారు. రానున్న 25 ఏళ్లలో దేశంలో చోటుచేసుకోనున్న శాస్త్రసాంకేతిక మార్పులపై చర్చించి అందుకు ప్రణాళికా బద్దంగా రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసేందుకు “విజన్ ఇండియా 2047” సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు.

Also Read:Union Govt : పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం షరతులు

ఐఐసీటీ హైదరాబాద్ క్యాంపస్ లో రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో ప్రధానంగా ఐదు అంశాలపై చర్చించనున్నారు. ఆరోగ్యం, నీరు, వ్యవసాయం, వాతావరణ మార్పులు, పర్యావరణ నిర్వహణలో కృత్రిమమేధ, వనరుల అభివృద్ధి, ఇంధన భద్రత వంటి అంశాలపై పరిశోధకులు ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు విజ్ఞాన భారతి సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం 75 సంవత్సరాల భారతదేశ స్వాతంత్య్ర వేడుకలు “ఆజాదీ కా అమృత్ మహోత్సవ్”లో భాగంగా మొదటిసారి నిర్వహిస్తున్నారు.

Also Read:Telangana Corona : తెలంగాణలో కొత్తగా 36 కరోనా కేసులు

కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, విజ్ఞాన భారతి నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జయంత్ సహస్రబుధే, నీతి ఆయోగ్ సభ్యుడు వి.కె. సరస్వత్, కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ శేఖర్ సి మండే, డిపార్ట్‌మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీ ఎస్. చంద్రశేఖర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ సెక్రటరీ రాజేష్ ఎస్ గోఖలే, డీఆర్డీవో చైర్మన్ జి. సతీష్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

Also read:Harish Rao On Medical College : నిన్న రిజర్వేషన్లు, నేడు మెడికల్ కాలేజీలు.. పార్లమెంటు సాక్షిగా అబద్దాలు-హరీష్ రావు