Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్

భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో ఈ పదవికి అజిత్ అగార్కర్‌ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది....

Ajit Agarkar : భారత క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్

Ajit Agarkar

Ajit Agarkar : భారత పురుషుల క్రికెట్ జట్టు సెలక్టర్ల ఛైర్మన్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ అజిత్ అగార్కర్ నియమితులయ్యారు. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ పురుషుల సెలక్షన్ కమిటీలో ఒక సెలెక్టర్ స్థానం కోసం దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీలో ఈ పదవికి అజిత్ అగార్కర్‌ను ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. (Indias chairman of selectors for mens cricket team)

Issues Whip to MLAs : మహారాష్ట్ర ఎన్సీపీలో శరద్ పవార్, అజిత్ పవార్‌ల మధ్య విప్ వార్

అజిత్ అగార్కర్ 1998 నుంచి 2007 వరకు 191 వన్డేలు, 26 టెస్టు మ్యాచ్ లు, నాలుగు టీ 20 మ్యాచ్ లు ఆడారు. 2007లో దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టులో అజిత్ అగార్కర్ ఉన్నారు. ఈయన లార్డ్స్ లో టెస్టు శతకం సాధించారు. ఇతను క్రికెటరుగా రిటైరయ్యాక సీనియర్ ముంబై జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా నియమితుడయ్యారు. ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచింగ్ బాధ్యతలను చేపట్టారు.