Agent: ఏజెంట్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు...

Agent: ఏజెంట్ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్..?

Akhil Agent Movie Teaser Release Date Locked

Agent: అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఏజెంట్’ ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తుండటంతో ఏజెంట్ మూవీపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా కోసం అఖిల్ భారీగా మేకోవర్ అవుతుండటంతో ఈ సినిమాలో ఆయన ఎలా కనిపిస్తాడా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. భారీ వర్కవుట్స్ చేస్తూ బీస్ట్ మోడ్‌లోకి అఖిల్ రావడంతో, ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు.

Agent: అఖిల్ ఆశలన్నీ ఏజెంట్‌పైనే.. స్టార్ హీరో స్టేటస్ తెచ్చేనా?

ఇక తాజాగా ఈ సినిమా టీజర్‌కు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని మే 12న ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటుగా ఏజెంట్ టీజర్‌ను కూడా రిలీజ్ చేయాలని అఖిల్ అండ్ టీమ్ భావిస్తోంది. ఇలా చేయడంతో తమ సినిమాకు కావాల్సినంత ప్రమోషన్ జరిగిపోతుందని, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై హైప్‌ను క్రియేట్ చేయడం సులువుగా మారుతుందని వారు భావిస్తున్నారు.

Agent: క్రేజీ అప్డేట్.. అఖిల్ ఏజెంట్ లో మలయాళ మెగాస్టార్!

మరి నిజంగానే అఖిల్ ఏజెంట్ సినిమా టీజర్‌ను సర్కారు వారి పాట సినిమా రిలీజ్ రోజునే విడుదల చేస్తారా.. ఆ సినిమాకు అటాచ్ చేసి ఏజెంట్ టీజర్‌పై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు క్రియేట్ చేయడంలో వారు సక్సెస్ అవుతారా అనే విషయాలు తెలియాలంటే చిత్ర యూనిట్ నుండి అఫీషియల్ క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.