Pathaan Row: పఠాన్ ‘బేషరం రంగ్’ వివాదంపై స్పందించిన యోగి ఆదిత్యనాథ్.. ఏమన్నారంటే

ఈ చిత్రంలోని బేషరం రంగ్ పాటలోని కాస్ట్యూమ్స్ విషయంలో హిందూ సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ‘బాయ్‌కాట్ పఠాన్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. తాజాగా ఈ వివాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ అంశంపై ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.

Pathaan Row: పఠాన్ ‘బేషరం రంగ్’ వివాదంపై స్పందించిన యోగి ఆదిత్యనాథ్.. ఏమన్నారంటే

Pathaan Row: షారుక్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని బేషరం రంగ్ పాటలోని కాస్ట్యూమ్స్ విషయంలో హిందూ సంస్థల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో ‘బాయ్‌కాట్ పఠాన్’ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

Aero India 2023: ఏరో ఇండియా షో కోసం మాంసం విక్రయాలపై నిషేధం.. షోకి, మాంసానికి సంబంధం ఏంటి?

తాజాగా ఈ వివాదంపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఈ అంశంపై ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ‘‘ఒక సినిమా రూపొందించేటప్పుడు ఆ సినిమా దర్శకుడు వివాదాస్పద అంశాల జోలికి వెళ్లకూడదు. సినిమాలో ప్రజల మనోభావాలు దెబ్బతినే అంశాలు లేకుండా చూసుకోవాలి’’ అని వ్యాఖ్యానించారు. కళాకారులను గౌరవించే విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ‘‘ఏ కళాకారుడినైనా, సాహితీవేత్తనైనా, వారు చేసే పనినిబట్టి గౌరవిస్తాం. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం సినిమాలు, సినిమాల నిర్మాణం కోసం ఒక ప్రత్యేక పాలసీని రూపొందించింది’’ అని ఆయన గుర్తు చేశారు.

Andaman and Nicobar Islands: మహిళపై సామూహిక అత్యాచారం.. అండమాన్ మాజీ ప్రధాన కార్యదర్శిపై చార్జిషీటు దాఖలు

సినీ పరిశ్రమకు అనుకూలంగా ఇటీవల యూపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. సినిమా చిత్రీకరణకు అనుకూలంగా యూపీ కొత్త పాలసీని రూపొందించింది. తమ రాష్ట్రంలో చిత్ర నిర్మాణం చేపట్టాల్సిందిగా బాలీవుడ్ పరిశ్రమని కోరింది. అనేక చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరుపుకొంటాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవలే బాలీవుడ్ ప్రముఖులు సునీల్ శెట్టి తదితరులు యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు. కొంతకాలంగా పఠాన్ సహా బాలీవుడ్ చిత్రాలను నిషేధించాలని ఒక వర్గం డిమాండ్ చేస్తూనే ఉంది. పఠాన్ మూవీకి సంబంధించి ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లు ధ్వంసం చేస్తామని కొన్ని హిందూ సంస్థలు హెచ్చరించాయి. అయితే, వాటన్నింటిని దాటుకుని సినిమా సూపర్ హిట్ అయింది.