Pushpa 2 : పుష్ప గ్లింప్స్ లో ఇది గమనించారా.. స్టోరీ ఇదేనా?

రిలీజ్ అయిన పుష్ప 2 గ్లింప్స్ లో ఈ విషయాన్ని గమనించారా? కథ ఇదేనంటా!

Pushpa 2 : పుష్ప గ్లింప్స్ లో ఇది గమనించారా.. స్టోరీ ఇదేనా?

Allu Arjun Pushpa 2 story revealed in glimpse video

Pushpa 2 : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పుష్ప 2 అప్డేట్ వచ్చేసింది. 2021లో అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కలయికలో వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా సక్సెస్ ని అందుకొని సంచలనం సృష్టించింది. కాగా ఈ చిత్రం రెండు భాగాలుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవడంతో సెకండ్ పార్ట్ పై భారీ హైప్ నెలకుంది. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ ఆడియన్స్ లో మరింత క్యూరియాసిటీ పెంచేసింది. ఈ గ్లింప్స్ లో తిరుపతి జైలు నుంచి పుష్ప తప్పించుకున్నట్లు చూపించారు.

Allu Arjun: చరణ్ బర్త్ డే వేడుకల్లో కనిపించని అల్లు అర్జున్.. రీజన్ ఏమిటో చెప్పిన బన్నీ టీమ్!

ఇక తప్పించుకున్న పుష్ప ఎక్కడ ఉన్నాడు అనే ఒక సస్పెన్స్ ని క్రియేట్ చేశారు. పుష్ప ఎక్కడ ఉన్నాడు అనేదాని అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏప్రిల్ 7న తెలియజేయనున్నారు. ఇది ఇలా ఉంటే, ఈ గ్లింప్స్ లో పుష్ప జైలు నుంచి తప్పించుకున్నది 2004లో అని చూపించారు. పుష్ప 1లో శ్రీవల్లి (Rashmika Mandanna) ‘చూడాలని ఉంది’ సినిమాకి వెళ్లే సీన్ అందరికి గుర్తుకు ఉండే ఉంటది. చూడాలని ఉంది సినిమా 1998లో రిలీజ్ అయ్యింది. దీని బట్టి చూస్తుంటే భన్వార్ సింగ్ షేఖావత్ (Fahadh Faasil) పుష్పని అరెస్ట్ చేసి ఆరేళ్ళ పాటు జైల్లో వేశాడా? అనే నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Allu Arjun: ఇండియాస్ పాపులర్ టాక్ షోలో సందడి చేయనున్న సౌత్ పాన్ ఇండియా స్టార్స్..?

పుష్ప 1 కథని కూడా పుష్ప అనుచరుడు కేశవా నెరేట్ చేస్తుంటాడు. ఈ పాయింట్ కూడా అందుకు అనుగుణం గానే ఉంది అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు సినిమా కథ ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా గ్లింప్స్ మంచి క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ లో ‘ఊ అంటావా మావ’ అంటూ పాన్ ఇండియా మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన దేవి.. సెకండ్ పార్ట్ లో ఎటువంటి ఐటెం నెంబర్ తయారు చేశాడో చూడాలి.