Allu Arjun Pushpa: తగ్గేదే లే.. యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.40 కోట్లు!

పుష్ప సినిమా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఊరమాస్ లుక్ లో మార్చేసి ఐకాన్ స్టార్ గా చూపించాడు మన లెక్కల మాస్టర్ సుకుమార్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి.

Allu Arjun Pushpa: తగ్గేదే లే.. యాక్షన్ సన్నివేశాల కోసమే రూ.40 కోట్లు!

Allu Arjun Pushpa

Allu Arjun Pushpa: పుష్ప సినిమా కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను ఊరమాస్ లుక్ లో మార్చేసి ఐకాన్ స్టార్ గా చూపించాడు మన లెక్కల మాస్టర్ సుకుమార్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్, టీజర్ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమాలో అడవిలో వచ్చే యాక్షన్ సన్నివేశాలే ప్రాణం. అందుకే ఈ సన్నివేశాల కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేశారని ప్రచారం జరుగుతుంది. కేవలం యాక్షన్ సన్నివేశాల కోసం ఏకంగా రూ.40 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్తున్నారు.

పుష్ప సినిమాను భారతీయ అన్ని భాషలలో విడుదల చేయనుండగా పాన్‌ ఇండియాగా దీన్ని తెరకెక్కించారు. అదే స్థాయిలో సినిమా గ్రాండ్ గా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఖర్చు విషయంలో నిర్మాతలు అస్సలు రాజీపడలేదట. బెస్ట్ ఫైట్స్ కంపోజ్ చేయమంటూ యాక్షన్ ఎంకరేజ్ చేస్తున్నారట. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ లో యాక్షన్ సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయి. మరి ఇక సినిమా విడుదల తర్వాత సినిమాలో ఈ సన్నివేశాల గురించే ఇండస్ట్రీ మాట్లాడుకొనేలా ఉంటాయని తెలుస్తుంది.

సహజంగానే సుకుమార్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే అది మరో లెవల్ లో ఉంటుందని ఇప్పటికే నిరూపించేశాడు. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలాతో స్పెషల్ సాంగ్ చేయిస్తున్నాడు. ఇక దేవి శ్రీ, సుకుమార్, బన్నీ కాంబినేషన్ అంటే మ్యూజిక్ మీద కూడా భారీ అంచనాలే ఉంటాయి. ఆ అంచనాలకు తగ్గట్లే దేవిశ్రీ శ్రమిస్తున్నాడు. మొత్తంగా పాన్ ఇండియా స్థాయి సినిమాల్లో బన్నీ కెరీర్ లో ఇదో బెస్ట్ సినిమాగా మారడం ఖాయంగా సుకుమార్ అండ్ టీమ్ ధీమాగా ఉంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలంటే ఆగస్టు 13 వరకు వెయిట్ చేయాల్సిందే!

Read: Egypt Train Crash: ఘోర రైలు ప్ర‌మాదం.. 11 మంది మృతి.. వందలాది మందికి గాయాలు!