Ambati Rayudu: ఐపీఎల్‌కు అంబ‌టి రాయుడు గుడ్ బై

చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు అంబ‌టి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆదివారం(మే 28న‌) అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచే త‌న‌కు ఆఖరిద‌ని కొద్ది సేప‌టి క్రిత‌మే సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

Ambati Rayudu: ఐపీఎల్‌కు అంబ‌టి రాయుడు గుడ్ బై

Ambati Rayudu retirement

Ambati Rayudu retirement : చెన్నై సూప‌ర్ కింగ్స్ స్టార్ ఆట‌గాడు అంబ‌టి రాయుడు ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆదివారం(మే 28న‌) అహ్మ‌దాబాద్ వేదిక‌గా న‌రేంద్ర మోదీ స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచే త‌న‌కు ఆఖరిద‌ని కొద్ది సేప‌టి క్రిత‌మే సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు.

“ఈ రోజు జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ మ్యాచే నాకు ఆఖ‌రిది. ఇప్ప‌టి వ‌ర‌కు న‌న్ను ఆదరించిన అభిమానులకు ధ‌న్య‌వాదాలు. రెండు గొప్ప జ‌ట్లు ముంబై ఇండియ‌న్స్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున‌ 204 మ్యాచులు ఆడాను. 14 సీజ‌న్లు 11 ప్లే ఆఫ్స్‌లు, 8 పైన‌ల్స్ ఆడాను. 5 సార్లు ట్రోఫీ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాను. బహుశా ఈ రోజు ఆరోది కావొచ్చు. ఐపీఎల్ జ‌ర్నీని ఆద్యంతం ఆస్వాదించాను. రిటైర్‌మెంట్ పై మ‌ళ్లీ ఆలోచించేది లేదు.” అంటూ రాయుడు ట్వీట్ చేశాడు.

IPL2023: ఐపీఎల్ ఫైన‌ల్‌కు వ‌ర్షం ముప్పు.. ర‌ద్దైతే ఆ జ‌ట్టే విజేత‌..? నిబంధ‌న‌లు ఏం చెబుతున్నాయంటే..?

అంబ‌టి రాయుడు 2010లో ముంబై ఇండియ‌న్స్ త‌రుపున ఐపీఎల్ లో అరంగ్రేటం చేశాడు. ఇప్పటివరకు 203 మ్యాచ్‌లు ఆడాడు. 28.29 స‌గ‌టుల‌తో 4,329 ప‌రుగులు చేశాడు. ఇందులో 23 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. 2010 నుంచి 2017 వ‌ర‌కు ముంబైకు ప్రాతినిధ్యం వ‌హించిన రాయుడు నిల‌క‌డ‌గా ఆడుతూ జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు. 2018 నుంచి చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ఆడుతున్నాడు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు రాయుడు ఐదు సార్లు ఐపీఎల్‌ను టైటిల్స్‌ను గెలుచుకున్న జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నాడు. ముంబై ఇండియ‌న్స్ త‌రుపున 2013,2015, 2017 సీజ‌న్ల‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున 2018, 2021లో టైటిల్‌ల‌ను అందుకున్నాడు. నేడు జ‌రిగే ఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిస్తే ఆరో సారి క‌ప్‌ను ముద్దాడ‌నున్నాడు.

IPL2023 final: పోటెత్తిన అభిమానులు..Updates in Telugu