Ramcharitmanas: విపక్షాల డిమాండ్లను తలకిందులు చేస్తూ మౌర్యకు మద్దతు ఇచ్చిన అఖిలేష్!

1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో బలమైన పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ ఈ డిమాండుకు ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోంది

Ramcharitmanas: విపక్షాల డిమాండ్లను తలకిందులు చేస్తూ మౌర్యకు మద్దతు ఇచ్చిన అఖిలేష్!

Amid Ramcharitmanas row, Akhilesh meets Maurya, breaks silence

Ramcharitmanas: రామచరితమానస్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సమాజ్‭వాదీ పార్టీ (ఎస్పీ) నేత స్వామి ప్రసాద్ మౌర్యను పార్టీ నుంచి తొలగించాలని భారతీయ జనతా పార్టీ సహా రైట్ వింగ్ సంస్థలు చేసిన డిమాండ్లను ఎస్సీ అధినేత అఖిలేష్ యాదవ్‭ పట్టించుకోలేదు సరికదా.. మౌర్యకు మద్దతుగా నిలిచినట్లే కనిపిస్తోంది. తాజాగా అఖిలేష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. దళితులను, గిరిజనులను, ఓబీసీలను భారతీయ జనతా పార్టీ శూద్రులుగా చూస్తోందని అఖిలేష్ మండిపడ్డారు. రామచరితమానస్ కాంట్రవర్సీలో మౌర్య సైతం అటుఇటుగా ఇవే వ్యాఖ్యలు చేశారు. ఆ గ్రంథంలో వెనుకబడిన వర్గాలను నీచులుగా చూపించారని విమర్శించారు.

Supreme Court: కుటుంబ గొడవల్లోకి న్యాయవాదులను లాగొద్దంటూ లలిత్ మోదీకి సుప్రీంకోర్టు చురక

ఈ నేపథ్యంలో అఖిలేష్ కూడా కులాల ఆధిపత్యాన్ని ఎత్తి చూపుతూ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఇంతే కాకుండా, మౌర్య గురించి ప్రస్తావించగా.. కులగణనలో ఆయన కీలక పాత్ర పోషించనున్నట్లు ప్రకటించారు. శనివారం సాయంత్రం మౌర్యను అఖిలేష్ కలిసిన అనంతరం ఈ ప్రకటన రావడం విశేషం. బిహార్ ప్రభుత్వం ఇప్పటికే కులగణన ప్రారంభించింది. ఇతర వెనుకబడిన వర్గాల (ఓబీసీ) సామాజిక, ఆర్థిక అంశాలే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి నితీశ్ ప్రభుత్వం స్వీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. అలాంటి దీనికి మౌర్య ఎస్పీ నుంచి కీలకంగా వ్యవహరిస్తున్నట్లు అఖిలేష్ చేసిన ప్రకటన చూస్తుంటే, బీజేపీ మందిర్ రాజకీయాలను ఢీకొట్టడానికి మండల్ రాజకీయాలను పైకి లేపేందుకు అఖిలేష్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

Uddhav Sena: ములాయంకు పద్మ అవార్డు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఉద్ధవ్ సేన.. బాల్ థాకరే, సావర్కర్‭లకు మరిచారంటూ ఆగ్రహం

బిహార్ మంత్రి చంద్రశేఖర్ మొదటగా రామచరితమానస్ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సహా రైట్ వింగ్ సంస్థలు అన్నీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నప్పటికీ, నితీశ్ మాత్రం అంతగా పట్టించుకోలేదు. ఇక ఇది జరిగిన వారం రోజులకే స్వామి ప్రసాద్ మౌర్య అదే గ్రంథంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక్కడా అదే జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల అఖిలేష్ సంతృప్తిగా లేరని, ఆయనపై చర్యలు తీసుకోవచ్చని ఊహాగాణాలు వచ్చినప్పటికీ, చర్యలకు బదులు ఓబీసీ గణనలో కీలక భాగస్వామిని చేస్తుండడం గమనార్హం.

Telangana Secretariat: తెలంగాణ నూతన సచివాలయం డ్రోన్ వీడియో .. సాగర తీరాన అద్భుత కట్టడం ..

1991 కి ముందు దేశాన్ని కుదిపివేసిన మండల్ ఉద్యమం ప్రధానంగా బిహార్, యూపీ రాష్ట్రాలు కేంద్రంగానే సాగింది. ఇందులో బిహార్ రాష్ట్రంలోని ప్రభుత్వం అధికారికంగా కులగణన ప్రారంభించగా, యూపీ నుంచి ఎస్పీ ఇప్పుడిప్పుడే ఈ డిమాండుకు సై అంటోంది. ఇక యూపీలో మరో బలమైన పార్టీ అయిన బహుజన్ సమాజ్ పార్టీ ఈ డిమాండుకు ఎప్పటి నుంచో మద్దతు ఇస్తోంది. ఈ పరిణామాలు చూస్తుంటే 2024లో బీజేపీని ఢీకొట్టేందుకు ఓబీసీ అంశాన్ని ప్రధానంగా తెరపైకి తెచ్చే పనిలో మండల్ పార్టీలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.