Amitabh Bachchan: ప్రాజెక్ట్ Kలో బిగ్ బి పాత్ర ఇదేనా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు.....

Amitabh Bachchan: ప్రాజెక్ట్ Kలో బిగ్ బి పాత్ర ఇదేనా?

Amitabh Bachchan Role In Prabhas Project K

Amitabh Bachchan: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధేశ్యామ్’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించగా, ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ రొమాంటికల్ మూవీగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో అతిభారీ అంచనాలు క్రియేట్ అవ్వగా, రిలీజ్ రోజున ఈ సినిమాకు వచ్చిన నెగెటివ్ టాక్‌తో ఈ చిత్రం భారీ డిజాస్టర్ వైపు వెళ్లింది. ఇక ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఈ సినిమా ప్రభాస్ సక్సెస్ ట్రాక్‌కు బ్రేక్ వేసింది.

Project K: హెల్ప్ ప్లీజ్ అంటూ హైప్ పెంచిన అశ్విన్.. అసలేంటి ప్రాజెక్ట్ కె?

అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే, ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా ఓకే చేస్తూ దూకుడు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఆదిపురుష్, సలార్ వంటి పాన్ ఇండియా చిత్రాలు వరుసగా చేస్తున్న ప్రభాస్, మహానటి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ఓ సైన్స్-ఫిక్షన్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు ప్రాజెక్ట్ K అనే టైటిల్‌ను తాత్కాలింగా పెట్టిన చిత్ర యూనిట్, ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యనిట్ గతంలోనే వెల్లడించింది.

Project K : ప్రభాస్ విందు భోజనంపై.. జీర్ణించుకోలేను అంటూ అమితాబ్ ప్రశంసలు

అయితే తాజాగా ప్రాజెక్ట్ Kలో అమితాబ్ చేయబోయే పాత్రకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో బిగ్ బి అశ్వద్ధామ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ పాత్రను మహాభారతంలోని అశ్వద్ధామ పాత్ర నుండి స్పూర్తిగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ Kలో బిగ్ బి పాత్ర చుట్టూ కథ తిరుగుతుందనే వార్త ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆయన పాత్ర కారణంగా ఈ సినిమా కథ ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే అంశంపై ప్రాజెక్ట్ K చిత్రం ఉండబోతుందట. ఏదేమైనా ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తుండగా, అశ్విని దత్ ఈ సినిమాను భారీ వ్యయంతో ప్రొడ్యూస్ చేస్తున్నారు.