Viral News in Bihar: బాలిక కోసం ఊరు ఊరంతా పరీక్షా కేంద్రానికి తరలి వచ్చారు, ఎందుకంటే?

బాలికను చూసి ఆ గ్రామస్తులంతా చెప్పలేని సంతోషంతో తిరిగి అభివాదం చేశారు. ఇది బీహార్లోని డబ్ టోల్ గ్రామంలో గురువారం నాడు చోటుచేసుకున్న ఓ అపురూప దృశ్యం.

Viral News in Bihar: బాలిక కోసం ఊరు ఊరంతా పరీక్షా కేంద్రానికి తరలి వచ్చారు, ఎందుకంటే?

Girl

Viral News in Bihar: బిహార్ లోని సితామర్హి జిల్లాలోని డబ్ టోల్ గ్రామం..ఒక బాలిక.. ముందు నడుచుకుంటూ వెళ్తుండగా.. వెనుకనే గ్రామస్తులు ఆ బాలికను అనుసరిస్తూ వస్తున్నారు. ఇంతలో ఒక పాఠశాల వద్దకు వెళ్లిన ఆ బాలిక.. గదిలోకి అడుగు పెట్టేముందు..ఒక్క క్షణం ఆగి వెనక్కు తిరిగి.. చేతులు ఊపుతూ.. తమ గ్రామస్తులకు అభివాదం చేసింది. బాలికను చూసి ఆ గ్రామస్తులంతా చెప్పలేని సంతోషంతో తిరిగి అభివాదం చేశారు. ఇది బీహార్లోని డబ్ టోల్ గ్రామంలో గురువారం నాడు చోటుచేసుకున్న ఓ అపురూప దృశ్యం. ఎందుకంటే.. 900 మంది జనాభా ఉన్న ఆ దళిత గ్రామంలో ఇంత వరకు ఏ ఒక్క అమ్మాయి కూడా మెట్రిక్యులేషన్ పరీక్ష వరకు చేరుకోలేదు. ఇటీవలే ఇందిరా కుమారి అనే బాలిక.. మాత్రం అన్ని అవరోధాలను అధిగమించి మెట్రిక్యులేషన్ పరీక్షకు హాజరైంది.

Also read: High Court of Gujarat: హైకోర్టు ఆవరణలో కోక్ తాగిన పోలీస్.. వింత శిక్ష విధించిన జడ్జి

అభివృద్ధి అనే పదానికి ఆమడ దూరంలో, కటిక పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న ఆ గ్రామంలో.. ఆడపిల్లల చదువుకు పునాది వేసినట్లుగా ఇందిరా కుమారి మెట్రిక్యులేషన్ పరీక్ష రాయడం సంచలనంగా మారింది. దీంతో ఇందిరా కుమారికి శుభాకాంక్షలు తెలిపేందుకు ఊరు ఊరంతా స్థానిక పరీక్షా కేంద్రానికి తరలిరావడం అందరి దృష్టిని ఆకర్షించింది. బీహార్ లోని పరిహార్ బ్లాక్, బతువారా పంచాయతీకి కొంత దూరంలో ఉన్న డబ్ టోల్ గ్రామంలో సుమారు 900 మంది జనాభా ఉన్నారు. స్థానికంగా కూలి పనులు, ఇతర వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఊరులో కొందరు యువకులు డిగ్రీ వరకు చదువుకున్నారు గాని, ఉద్యోగాలు చేసే స్థాయికి మాత్రం చేరుకోలేదు. ఇక ఆడపిల్లల సంగతి సరేసరి. ఈక్రమంలో ఇందిరా కుమారి ఇటీవల మంచి మార్కులతో ప్రీ-బోర్డ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (బిఎస్ఇబి) ఆధ్వర్యంలో మెట్రిక్యులేషన్ పరీక్షకు అర్హత సాధించింది. దీంతో గ్రామస్తుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది.

Also read: Vizianagaram : తల్లితో కలిసి రూ.3 కోట్ల చీటీ డబ్బులు తీసుకుని పారిపోయిన వార్డ్ వాలంటీర్

బాలిక ఉన్నతవిద్యకు అర్హత సాధించడం పట్ల గ్రామస్తులు స్పందిస్తూ “ఇందిర ఎందరికో ప్రేరణగా నిలిచిందని అన్నారు. “జీవితంలో అన్ని కష్టాలతో పోరాడింది కాని చదువును విడిచిపెట్టలేదు. చదువు కోసం ఇందిరా చూపిన అంకితభావానికి మేము వందనం చేస్తున్నాము” అని స్థానికుడొకరు అన్నారు. ఇప్పటి నుండి దళిత వర్గానికి చెందిన ఇతర బాలికలు సైతం ఆమెను అనుసరిస్తారని తెలిపారు. “బచ్పన్ బచావో ఆందోళన్” అనే స్వచ్చంద సంస్థ బీహార్ లోని వెనుకబడిన గ్రామాల్లో బాలికల విద్యకోసం కృషి చేస్తుంది. ఈక్రమంలో ఇందిరా కుమారి సాధించిన ఘనతపై “బచ్పన్ బచావో ఆందోళన్” సంస్థ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.

Also read: Saudi Arabia Women Jobs: సౌదీలో బుల్లెట్‌ ట్రైన్స్‌ నడపడానికి 30 వేలమంది మహిళలు దరఖాస్తు..అభ్యుదయం దిశగా అతివల అడుగులు..