Anasuya Bharadwaj : సునీల్ భార్యగా నెగెటివ్ క్యారెక్టర్‌లో అనసూయ..

స్టార్ యాంకర్ అనసూయ.. మంగళం శ్రీను భార్యగా సరికొత్త క్యారెక్టర్‌లో కనిపించనుంది..

Anasuya Bharadwaj : సునీల్ భార్యగా నెగెటివ్ క్యారెక్టర్‌లో అనసూయ..

Anasuya Bharadwaj

Updated On : November 7, 2021 / 6:12 PM IST

Anasuya Bharadwaj : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వస్తున్న హ్యట్రిక్ సినిమా ‘పుష్ప’.. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని మైత్రీ మూవీస్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. రష్మిక మందన్న కథానాయిక.. వెర్సటైల్ మలయాళీ యాక్టర్ ఫాహద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు.

Sree Vishnu : ఎన్టీఆర్ ఫ్యాన్‌గా శ్రీ విష్ణు.. గ్రామ వాలంటీర్‌గా హీరోయిన్!

పాపులర్ కమెడియన్ కమ్ హీరో సునీల్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఆయన చేస్తున్న మంగళం శ్రీను క్యారెక్టర్ లుక్ ఆదివారం రిలీజ్ చెయ్యగా మంచి రెస్పాన్స్ వచ్చింది. పూర్తి స్థాయి విలన్ రోల్‌లో క్రూషియల్‌గా డిజైన్ చేసిన సునీల్ పాత్ర ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు.

Bangarraju : ‘లడ్డుందా’ అంటూ స్వర్గంలో సోగ్గాడి ఆట..

ఈ సినిమాలో అనసూయ, సునీల్ భార్యగా నటించబోతుందని, ఆమెది కూడా నెగెటివ్ రోల్ అని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మంగళం శ్రీను లుక్ వదలడంతో.. ‘పుష్ప’ సెట్‌లో లీక్ అయిన అనసూయ పిక్, సునీల్ స్టిల్ పక్కన పెట్టి.. వీళ్లిద్దరూ పెయిర్ అంటూ మరోసారి మీమ్స్ వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 17న ‘పుష్ప’ రాజ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Anasuya Bharadwaj : బరువు పెరిగిన స్టార్ యాంకర్.. ‘పుష్ప’ కోసమేనా..