AP Corona Update : ఏపీలో కొత్తగా 1,869 కరోనా కేసులు, 18 మంది మృతి

ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,869 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో కరోనా ప్రారంభం నుంచి ఆగస్టు 11,2021 వరకు 13 వేల 582 మంది చనిపోయారు.

10TV Telugu News

AP Corona Update : ఏపీలో 24 గంటల వ్యవధిలో 1,869 మందికి కరోనా సోకింది. 18 మంది చనిపోయారు. ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. ఏపీలో కరోనా ప్రారంభం నుంచి ఆగస్టు 11,2021 వరకు 13 వేల 582 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 2,316 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారని, నేటి వరకు రాష్ట్రంలో 2,53,82,769 శాంపిల్స్ చేసినట్లు వెల్లడించింది. ఏపీలో ఆగస్టు 11 2021 వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 19,87,051. ఇక గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతుంది.

ఏ జిల్లాలో ఎంత మంది చనిపోయారు :
చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, ప్రకాశం ముగ్గురు, గుంటూరు ఇద్దరు, తూర్పు గోదావరి, అనంతపూర్, విశాఖపట్టణం, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 19,87,051 పాజిటివ్ కేసులకు గాను..19 లక్షల 55 వేల 055 మంది డిశ్చార్జ్ కాగా..13 వేల 582 మంది మృతి చెందారని..ప్రస్తుతం 18 వేల 417 మంది చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

జిల్లాల వారీగా కేసులు : అనంతపురం 51. చిత్తూరు 175. ఈస్ట్ గోదావరి 385. గుంటూరు 222. వైఎస్ఆర్ కడప 133. కృష్ణా 148. కర్నూలు 10. నెల్లూరు 177. ప్రకాశం 98. శ్రీకాకుళం 82. విశాఖపట్టణం 63. విజయనగరం 21. వెస్ట్ గోదావరి 304. మొత్తం : 1,869

×