WhatsApp Edit Contacts : ఆండ్రాయిడ్ యూజర్లకు అలర్ట్.. ఇకపై వాట్సాప్‌లోనే కాంటాక్టులను ఎడిట్ చేయొచ్చు..!
WhatsApp Edit Contacts : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వస్తోంది. ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్ల (Whatsapp Users) కోసం ఈ కొత్త ఫీచర్ రానుంది. వాట్పాప్‌లోని కాంటాక్టులను అక్కడే ఎడిట్ చేసుకునే ఆప్షన్ రానుంది.

Android users, WhatsApp may soon allow you to edit contacts within the app
WhatsApp Edit Contacts : ప్రముఖ మెటా ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ఆండ్రాయిడ్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. (WaBetaInfo) నివేదిక ప్రకారం.. ఈ ప్లాట్‌ఫారమ్ కాంటాక్టులను యాడ్ చేసేందుకు యాప్ నుండి నిష్క్రమించాల్సిన అవసరం ఉండదు. వాట్పాప్ ప్లాట్ ఫారంలోనే కాంటాక్టుల వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ కొత్ ఫీచర్ డెవలప్ మెంట్ స్టేజీలో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ కొన్ని బీటా టెస్టర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ బీటా యూజర్లు వాట్సాప్ నుంచి బయటకు రాకుండానే తమ ఫోన్‌బుక్ లేదా Google అకౌంట్లకు లింక్ చేసేందుకు కొత్త కాంటాక్టులను యాడ్ చేయొచ్చు.
వాట్సాప్‌లో యూజర్లు మిమ్మల్ని కాంటాక్టు అయినప్పుడు గుర్తు తెలియని నంబర్‌లను మీ కాంటాక్ట్‌ల లిస్టు సేవ్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాట్సాప్ యాప్‌ల మధ్య మారాల్సిన అవసరం ఉంటుంది. అదే.. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే.. వాట్సాప్ యాప్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండదు.
ఈ ఫీచర్ నుంచి నేరుగా వాట్సాప్‌లోనే కాంటాక్టులను ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్త కాంటాక్టులను అక్కడే యాడ్ చేసుకోవచ్చు. తద్వారా యూజర్ల సమయాన్ని ఆదా చేస్తుంది. ఈ ఫీచర్ ఎక్కడో ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వాట్సాప్ (Android Beta) యూజర్లు తమ యాప్‌లోని కాంటాక్టుల లిస్టుకు వెళ్లండి.

Android users, WhatsApp may soon allow you to edit contacts within the app
అందులో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటే.. వారికి ‘New Contact’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. వాట్సాప్ యూజర్లు ఈ వాట్సాప్ ఫీచర్‌ని ఉపయోగించి వారి కాంటాక్టులను యాడ్ చేయొచ్చు. అలాగే అప్పటికే యాడ్ చేసిన కాంటాక్టులను కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ యూజర్లలో వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్‌ను ఇన్‌స్టాల్ చేసిన కొంతమంది బీటా టెస్టర్‌లకు యాప్‌లో కాంటాక్టులను యాడ్ చేసే ఎడిట్ చేసే ఆప్షన్ ఎంచుకోవచ్చు. రానున్న రోజుల్లో వాట్సాప్ రెగ్యులర్ యూజర్లకు కూడా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ మోడ్ ఆండ్రాయిడ్ అన్ని బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. గుర్తు తెలియని వారికి, కంపానియన్ మోడ్ ఫీచర్ అనేది మల్టీ-డివైజ్ సపోర్టు ఎక్స్‌టెన్షన్ అని చెప్పవచ్చు. వాట్సాప్ యూజర్లు తమ ప్రస్తుత వాట్సాప్ అకౌంట్లో మరో మొబైల్ ఫోన్‌కి లింక్ చేసుకునేలా ఈ ఫీచర్ రూపొందించింది.
ఇప్పటికే ఉన్న WhatsApp అకౌంటును రెండో మొబైల్ ఫోన్‌కి లింక్ చేసిన తర్వాత వాట్సాప్ యూజర్లు ప్రైమరీ ఫోన్‌లో యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే రెండో డివైజ్‌లో వారి చాట్‌లను యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ వినియోగదారులు ఒకేసారి 4 డివైజ్‌లకు వాట్సాప్ అకౌంట్ లింక్ చేయవచ్చు. అంటే.. సింగిల్ వాట్సాప్ అకౌంట్ యూజర్లు తమ అకౌంటును రెండు కన్నా ఎక్కువ మొబైల్ ఫోన్‌లకు లింక్ చేయవచ్చు.