Tamilnadu Politics: ‘మేడం జయలలిత అంటే చాలా గౌరవం’.. అన్నాడీఎంకే దెబ్బతో స్వరం మార్చిన బీజేపీ చీఫ్

‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అవినీతిలో నంబర్ వన్ అని అన్నామలై అన్నారు.

Tamilnadu Politics: ‘మేడం జయలలిత అంటే చాలా గౌరవం’.. అన్నాడీఎంకే దెబ్బతో స్వరం మార్చిన బీజేపీ చీఫ్

Annamalai on Jayalalithaa: జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలై స్వరం మార్చారు. జయలలితను మేడం అని సంబోధిస్తూనే, ఆమె అంటే తనకు ఎంతో గౌరవమని, ఈ విషయం తాను ఎన్నోసార్లు చెప్పానని అన్నారు. జయలలితపై చేసిన విమర్శల అనంతరం అన్నామలైపై చర్యలు తీసుకునేందుకు అన్నాడీఎంకే పార్టీ తీర్మానం చేసింది. ఆ మర్నాడే అన్నామలై స్వరం మార్చి, పొగడ్తలు కురిపించారు.

Manipur Violence: మళ్లీ రణరంగమవుతోన్న మణిపూర్‭.. గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు, 9 మంది మృతి

‘‘మేడం జయలలిత అంటే నాకు చాలా చాలా గౌరవం ఉంది. ఆమె జీవితం గురించి, ఆమెపై నాకున్న గౌరవం గురించి నేను పలుమార్లు పలు సందర్భాల్లో చెప్పాను. ఒక మహిళా నేతతో డీఎంకే ఏ విధంగా వ్యవహరించింది, ఆమెను ఎంతగా ఇబ్బందులు పెట్టిందో చాలాసార్లు మాట్లాడాను. నేనెక్కడా ఆమెను అగౌరవ పరిచేలా ప్రస్తావించలేదు. నా వ్యాఖ్యల్ని తప్పుడుగా ప్రచారం చేయడం వల్ల కొందరికి వేరేలా అర్థమవుతోంది. నా పోరాటం అంతా అవినీతిపైనే. ఇదే మొదటి నుంచి చెప్తున్నాను’’ అని బుధవారం అన్నామలై అన్నారు.

Chhattisgarh: పాఠశాలలకు జూన్ 26 వరకు వేసవి సెలవులను పొడగించిన ఛత్తీస్‭గఢ్ ప్రభుత్వం

కొద్ది రోజుల క్రితం అన్నామలై ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏఐఏడీఎంకే మాజీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన ఏ ప్రభుత్వాన్నైనా ప్రశ్నిస్తామన్న ఆయన ‘‘తమిళనాడులో చాలా పరిపాలనలు అవినీతిమయమయ్యాయి. మాజీ ముఖ్యమంత్రులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. అందుకే తమిళనాడు అత్యంత అవినీతి రాష్ట్రంగా మారింది’’ అని అన్నారు. ఇక 1991-96 మధ్య కాలం (జయలలిత అధికారంలో ఉన్నప్పుడు) గురించి ప్రశ్నించగా, ఆ సమయం అవినీతిలో నంబర్ వన్ అని అన్నామలై అన్నారు.

Maharashtra Politics: తంటాలు తెచ్చిన ‘మోదీ-షిండే’ పత్రికా ప్రకటన.. బీజేపీని శాంతింపజేసేందుకు శివసేన మరో పత్రికా ప్రకటన

అన్నామలై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రతిపక్ష నేతతో అన్నాడీఎంకే అధినేత అయిన పళనిస్వామి అన్నారు. ఉద్దేశపూర్వకంగానే జయలలితపై అన్నామలై విమర్శలు చేశారని పళనిస్వామి అన్నారు. “అతని ప్రకటనలు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు ఏఐఏడీఎంకే కార్యకర్తలను బాధించింది” అని పళనిస్వామి అన్నారు. ఈ వ్యాఖ్యలపై అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) అధినేత TTV దినకరన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అన్నామలై ఎలాంటి అనుభవం లేని రాజకీయ నాయకుడని ఎద్దేవా చేశారు. ఎలాంటి రాజకీయ చరిత్ర లేకుండా అమ్మ (జయలలిత)పై అన్నామలై ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆయన అజ్ఞానాన్ని, అనుభవ రాహిత్యాన్ని తెలియజేస్తోందని మూడు పేజీల ప్రకటనలో టీటీవీ దినకరన్ పేర్కొన్నారు.