Maharashtra Politics: తంటాలు తెచ్చిన ‘మోదీ-షిండే’ పత్రికా ప్రకటన.. బీజేపీని శాంతింపజేసేందుకు శివసేన మరో పత్రికా ప్రకటన

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో “దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే” అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన ఒక సర్వేలో తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కంటే షిండేకు ఎక్కువ మంది మద్దతు లభించిందట

Maharashtra Politics: తంటాలు తెచ్చిన ‘మోదీ-షిండే’ పత్రికా ప్రకటన.. బీజేపీని శాంతింపజేసేందుకు శివసేన మరో పత్రికా ప్రకటన

Updated On : June 14, 2023 / 4:03 PM IST

Shinde sena vs BJP: మహారాష్ట్ర ప్రజలు తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కంటే ఎక్కువగా ఏక్‭నాథ్ షిండేనే కోరుకుంటున్నారని ఓ సర్వే ఇచ్చిన రిపోర్టు ఆధారంగా వార్తా పత్రికల్లో శివసేన ఇచ్చిన ప్రకటనతో భారతీయ జనతా పార్టీతో కయ్యానికి దారి తీసింది. శివసేన ఉద్దేశమేంటంటూ బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మరో ప్రకటనతో దీన్ని సరిదిద్దేందుకు శివసేన ప్రయత్నించింది. బుధవారం ఇచ్చిన మరొక వార్తా పత్రిక ప్రకటనలో స్వరం మార్చి ‘‘మేమంతా ఒక్కటే, మహారాష్ట్ర ప్రజలు మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Modi 9 Years Govt : తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో ఆకలి, దరిద్రం, నిరుద్యోగం మాత్రమే కనిపిస్తున్నాయ్ : చింతా మోహన్

క్రితం సర్వేను ఊటంకిస్తూ రాష్ట్రంలోని 49.3 శాతం ప్రజలు ఏక్‭నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వానికి ఓటేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఇదే కాకుండా ఇంతకు ముందు ప్రకటనలో శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే ఫొటో లేదు. కేవలం శివసేన ఎన్నికల గుర్తు మాత్రమే ఉంది. అయితే తాజా ప్రకటనలో బాల్ థాకరే సహా సీనియర్ నేత ఆనంద్ దిఘే ఫొటో కూడా వేశారు. ఇక మరోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫొటో కూడా వేశారు. ఇక తాజా ప్రకటనలో షిండే, ఫడ్నవీస్‭లు అభివృద్ధి అభివాదం చేస్తున్న ఫొటోను ముద్రించారు. శివసేన పార్టీ ఎన్నికల గుర్తు విల్లు-బాణంతో పాటు భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కమలాన్ని కూడా వేశారు.

Arvind Kejriwal: సీపీఐ అగ్రనేతలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ.. ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ..

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం అనేక వార్తాపత్రికలలో “దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్రకు ముఖ్యమంత్రి ఏక్‭నాథ్ షిండే” అనే శీర్షికతో పూర్తి పేజీ ప్రకటనను ఇచ్చింది. రాష్ట్రంలో నిర్వహించిన ఒక సర్వేలో తదుపరి ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ కంటే షిండేకు ఎక్కువ మంది మద్దతు లభించిందట. ఆ అంశాన్ని ఊటంకిస్తూ (ఫడ్నవీస్ పేరు ప్రత్యక్షంగా ప్రస్తావించలేదు) ఇచ్చిన పత్రికా ప్రకటన తాజాగా రాజకీయ వివాదానికి దారి తీసింది.

Manipur Violence: మళ్లీ రణరంగమవుతోన్న మణిపూర్‭.. గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులకు తెగబడ్డ తీవ్రవాదులు, 9 మంది మృతి

“ముఖ్యమంత్రి పదవి కోసం, మహారాష్ట్రలో 26.1 శాతం మంది ప్రజలు ఏక్‭నాథ్ షిండేను కోరుకోగా, 23.2 శాతం మంది ప్రజలు దేవేంద్ర ఫడ్నవీస్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు” అని ప్రకటనలో పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి, ప్రభుత్వంతో ప్రధాన భాగస్వామి అయిన ఫడ్నవీస్ గురించి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రకటన వేశారని బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫడ్నవీస్ సైతం ఈ ప్రకటనతో తీవ్ర అసంతృప్తికి గురైనట్లు తెలిసింది. అయితే ఫడ్నవీస్‭ను బీజేపీ వర్గాన్ని బుజ్జగించేందుకు బుధవారం మరో ప్రకటన వేసింది కానీ, అది ఎంత ఫలిస్తుందో చూడాలి మరి.