Arvind Kejriwal: సీపీఐ అగ్రనేతలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ.. ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ..

కేసీఆర్‌ని లొంగదీసుకోవడానికి మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ఐటీ సోదాలు జరుగుతున్నాయని నారాయణ అన్నారు.

Arvind Kejriwal: సీపీఐ అగ్రనేతలతో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భేటీ.. ఢిల్లీ ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ..

Delhi CM Arvind Kejriwal

Delhi CM Arvind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణలతో భేటీ అయ్యారు. ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ పై సీపీఐ మద్దతును అరవింద్ కేజ్రీవాల్ కోరారు. ఈ సందర్భంగా సీపీఐ నేతలు స్పందిస్తూ.. కేంద్రం తీసుకొచ్చిన సర్వీస్ ఆర్డినెన్స్ అంశంపై ఆప్ ప్రభుత్వానికి సీపీఐ మద్దతు తెలుపుతుందని చెప్పారు. భేటీ తరువాత వారు విలేకరులతో మాట్లాడారు.

Chennamaneni Ramesh: టికెట్ విషయంలో నాకు భయం లేదు.. ఎందుకంటే?: ఎమ్మెల్యే చెన్నమనేని

డి.రాజా మాట్లాడుతూ.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అధికారాల ఇవ్వడం లేదు. దేశ రాజధాని ఢిల్లీ, పుదుచ్చేరిలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. కేంద్రం తీసుకొస్తున్న ఆర్డినెన్స్‌ను మేము వ్యతిరేకిస్తున్నాం. ఢిల్లీ ప్రభుత్వానికి మేము అండగా ఉంటామని చెప్పారు. అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. సీఎం అయ్యాక మొదటిసారి సీపీఐ నేతలను కలిశాను. ఢిల్లీ ప్రజలు కోసం సీపీఐ కేంద్ర ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా మాకు మద్దతు తెలిపిందని కేజ్రీవాల్ అన్నారు. ఆర్డినెన్స్ కేవలం ఢిల్లీ కోసమే కాదు.. అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని, బీజేపీయేతర పార్టీలు ఎక్కడ ఉంటే అక్కడ ఇలాంటి ఆర్డినెన్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని, సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా పక్కన పెడుతున్నారని కేజ్రీవాల్ విమర్శించారు. అధికారులు మార్చే అవకాశం, ప్రభుత్వం నుండి కేంద్రం దూరం చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gorantla Madhav : టీడీపీ, బీజేపీ అగ్ర నాయకులపై ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. కేజ్రివాల్ మమ్మల్ని కలిసి మా మద్దతు కోరడం జరిగిందని తెలిపారు. ఎన్నికైన ప్రభుత్వం ఉండగా నామినేట్ చేసే గవర్నర్లకి అధికారులు ఇవ్వడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని నారాయణ చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వాలకి స్వేచ్ఛ ఉండాల్సిందేనని అన్నారు. ఢిల్లీ, పుదుచ్చేరి రెండు ప్రభుత్వాలపైన కేంద్రం ఇలాంటి చర్యలనే చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులను కేంద్రం అమలు చేస్తే మరి ఎన్నికలు ఉండాల్సిన అవసరం లేదు. తాజాగా తెలంగాణలో జరిగిన ఐటీ దాడులపై నారాయణ స్పందించారు. కేసీఆర్‌ని లొంగదీసుకోవడానికి మాత్రమే ఐటీ సోదాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయని అన్నారు.