NBK’s Unstoppable: మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్.. బాలయ్య షోలో మహేష్!

తెలుగు ఇండస్ట్రీ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరు చాలా విభిన్నం. బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాడు.

NBK’s Unstoppable: మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్.. బాలయ్య షోలో మహేష్!

Nbk’s Unstoppable

NBK’s Unstoppable: తెలుగు ఇండస్ట్రీ హీరోలలో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరు చాలా విభిన్నం. బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ కుటుంబానికి చాలా దగ్గరగా ఉంటాడు. సినిమా వేడుకలు.. ఇతరత్రా ఈవెంట్లలో పెద్దగా కనిపించని మహేష్ టీవీ షోలకు కూడా చాల అరుదుగానే వెళ్తుంటాడు. అయితే.. ఇప్పుడు కొత్తగా మహేష్ కూడా ఇతర హీరోలు హోస్ట్ చేసే షోలకు అతిధిగా వెళ్తూ సందడి చేస్తున్నాడు. ఈ మధ్యనే ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ప్రముఖ రియాల్టీ షో ఎవరు మీలో కోటీశ్వరులు షోలో స్పెషల్ అట్రాక్షన్ గా మారిన సంగతి తెలిసిందే.

Pushpa-Acharya: బన్నీ కోసం బాబాయ్.. చిరు కోసం అబ్బాయ్!

కాగా.. ఇప్పుడు మరో షోకు కూడా మహేష్ స్పెషల్ గెస్ట్ గా అటెండ్ అయ్యాడు. నటసింహం బాలకృష్ణ బుల్లితెర మీద కూడా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఓటీటీ ఆహాలో ఆయన హోస్ట్ చేస్తున్న ‘అన్‌ స్టాప‌బుల్‌’ టాక్ షో మంచు ఫ్యామిలీ, నానీ, అనిల్ రావిపూడి-బ్రహ్మానందంలతో మూడు ఎపిసోడ్స్ రాగా ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కూడా సిద్దమవుతుంది. అది కూడా మహేష్ లాంటి సూపర్ స్టార్ తో ఈ ఎపిసోడ్ కావడంతో ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Akhanda: బాలయ్య సినిమాకు అఘోరాలు.. ఫ్యాన్స్‌తో ముచ్చట్లు!

బాలయ్య షోలో మహేష్ బాబు ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రోజు డిసెంబర్ 5న ఈ ఎపిసోడ్ షూట్ కూడా పూర్తి చేయగా త్వరలోనే బ్లాక్ బస్టర్ ప్రోమో వదలనున్నారు. ఇక, బాలకృష్ణ, మహేష్ బాబు కలిసి ఓ టాక్ షోలో కనిపించడం ఇదే తొలిసారి కాగా వీరిద్దరి మధ్య ఫన్ ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. బాలకృష్ణతో మృదుభాషి అయిన మహేష్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

ProjectK: అచ్చ తెలుగు సంప్రదాయంలో దీపికాకు గ్రాండ్ వెల్‌కమ్