Anthrax in Telangana : వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం..వరుసగా చనిపోతున్న గొర్రెలు

తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ మరోసారి కలకలం సృష్టించింది. వరుసగా గొర్రెలు చనిపోతుండటంతో అధికారులు పరీక్షలు చేయించగా గొర్రెల్లో ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నాయని నిర్ధారించారు.

Anthrax in Telangana : వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం..వరుసగా చనిపోతున్న గొర్రెలు

Anthrax Tension In Warangal

anthrax tension in warangal : ఆంత్రాక్స్ మరోసారి తన ఉనికి చాటుకుంటోందా?తెలంగాణలో ఆంత్రాక్స్ చాపకింద నీరులా విస్తరిస్తోందా? అంటే నిజమేనని అనుమానులు తలెత్తుతున్నాయి. దీనికి కారణం తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఈ ఆంత్రాక్స్ జాడలు కలకలం సృష్టిస్తున్నాయి. జిల్లాలోని దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోవడంతో స్థానికులను ఆందోళన కలిగిస్తోంది. గొర్రెల వరుస మరణాలకు ఆంత్రాక్స్ వ్యాధే కారణమా?అనే భయాందోళనలకు గురవతున్నారు స్థానికులు. సాంబయ్య అనే వ్యక్తి పెంచుకునే గొర్రెల మందలో ఇటీవల కొన్ని రోజులుగా మందలో రోజుకొక గొర్రె చొప్పున చనిపోతున్నాయి. దీంతో ఆందోళన చెందిన సాంబయ్య తొగడరాయి పశువైద్యాధికారిదృష్టికి తీసుకెళ్లారు. దీంతో డాక్టర్ శారత చనిపోయిన గొర్రెల శాంపిల్స్ సేకరించి ఆ శాంపిల్స్‌ను పరీక్షల కోసం జిల్లా కేంద్రంలోని పశువుల ప్రధాన ఆసుపత్రి ల్యాబ్‌కు పంపించారు.

దీనికి సంబంధించి వచ్చిన రిపోర్టులు ఆందోళన కలిగిస్తున్నాయి. పరీక్షల రిపోర్టులో గొర్రెలకు ఆంత్రాక్స్ సోకినట్లు నిర్థారణ అయ్యింది. దీంతో గొర్రెల కాపరులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆంత్రాక్స్ గొర్రెల నుంచి మనుషులకు సోకితే ప్రాణహానీ జరిగే అవకాశం వుంది. దీంతో గొర్రెల మందను గ్రామానికి దూరంగా వుంచాలని అధికారులు ఆయా గొర్రెల మందల యజమానులకు సూచించారు. కాగా ఈ ఆంత్రాక్స్ వ్యాధి పశువుల నుంచి పశువులకే కాకుండా పశువుల నుంచి మనుషులకు కూడా సోకుతుంది. దీంతో స్థానికులే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు కూడా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.

Read more : Brain Function : మెదడు పనితీరు మెరుగు పరిచే ఆహారాలు ఇవే!..

ఆంత్రాక్స్ వ్యాధి శాఖాహార పశువుల్లో వస్తుంది. అంటే మేకలు, గొర్రెలు, గుర్రాలు వంటివాటిలో వ్యాపిస్తుంది. ఈ వ్యాధి బారినపడి పశువులను తాకితే మనషులకు కూడా ఇది సోకుతుంది. అంత్రాక్స్ న్యుమోనియా కేసులలో 95 శాతం శరీరం తాకడం వల్ల వ్యాప్తిచెందుతుంది. చర్మంపై బొబ్బలు, దద్దుర్లకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఆంత్రాక్స్ న్యుమోనియా.. బాసిల్లస్ ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టిరియా ద్వారా సోకుతుంది.

సాధారణంగా కలుషితమైన ఆహారం, మాంసం తినేటప్పుడు ఆంత్రాక్స్ వ్యాపిస్తుంది..ఈ వ్యాధి సోకింది అనటానికి వికారం, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. నేరుగా మనిషి నుంచి మనిషికి ఈ వ్యాధి సోకినా.. ఫ్లూ, కోవిడ్ మాదిరి అంత వేగంగా వ్యాప్తిచెందదు. కానీ జాగ్రత్తలు చాలా చాలా అవసరం.

Read more : మొలకెత్తిన పెసలు తినటం ఆరోగ్యానికి మంచిదా..__ Why Green Peas are Healthy and Nutritious

బాసిల్లస్ ఆంత్రాసిస్’ అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు మూడు రోజుల్లోనే బయటపడతాయి. కానీ, కొన్ని కేసుల్లో రెండు నెలల వరకూ లక్షణాలు బయటకు కనిపించవు. ఈ వ్యాధిని యాంటీబయాటిక్స్‌తో నయం చేయొచ్చు. కానీ, వ్యాధి లక్షణాలు కనిపించగానే ఎంత తొందరగా చికిత్స ప్రారంభిస్తే అంత మంచిది. ఆలస్యం చేస్తే, ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది.