Anu Emmanuel : నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్ కాదు.. కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్స్ తో నటించా..

అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ''నేను కెరీర్‌ ఆరంభంలోనే నాని, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేశాను. నేను ఎవరితో పని చేసినా కథ, బ్యానర్‌ గురించి ఆలోచిస్తాను. నాకు అవకాశాలు రావట్లేదు అనేది కరెక్ట్ కాదు. నేనే వరుసగా......................

Anu Emmanuel : నాకు అవకాశాలు రావడం లేదు అన్నది కరెక్ట్ కాదు.. కెరీర్ స్టార్టింగ్ లోనే స్టార్స్ తో నటించా..

Anu Emmanuel spoke about her movie chances

Anu Emmanuel :  హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ చాలా రోజుల తర్వాత ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానుంది. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా కొత్త దర్శకుడు రాకేష్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఊర్వశివో రాక్షసివో. గీత ఆర్ట్స్ ఈ సినిమాని నవంబర్ 4న రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్ లో కామెడీ, లవ్, రొమాన్స్ కంటెంట్ ఉండటంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. అను ఇమ్మాన్యుయేల్ కి చాలా గ్యాప్ రావడం, ఇటీవల ఎక్కువగా సినిమాలు చేయకపోవడం, ప్రస్తుతం అను చేతిలో ఒక సినిమా తప్పా వేరే అవకాశాలు కూడా లేవు. ఇదే విషయాన్ని ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఘాటుగానే సమాధానమిచ్చింది అను.

Rambha : నా కూతురు సాషా క్షేమంగానే ఉంది.. మీ అందరికి రుణపడి ఉంటాను..

అను ఇమ్మాన్యుయేల్ మాట్లాడుతూ.. ”నేను కెరీర్‌ ఆరంభంలోనే నాని, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌, నాగచైతన్య లాంటి స్టార్ హీరోలతో కలిసి పని చేశాను. నేను ఎవరితో పని చేసినా కథ, బ్యానర్‌ గురించి ఆలోచిస్తాను. నాకు అవకాశాలు రావట్లేదు అనేది కరెక్ట్ కాదు. నేనే వరుసగా సినిమాలు చెయ్యట్లేదు. నటిగా నేను ఫెయిల్‌ అయ్యాను అనే మాట నాకు వినపడలేదు. నేను నటించిన కొన్ని సినిమాల రిజల్ట్‌ చూశాక నన్ను నేను మార్చుకున్నాను. రెగ్యులర్‌ సినిమాలకు దూరంగా ఉండాలని అనుకున్నాను. అందుకే నా దగ్గరికి అవకాశాలు వచ్చినా ఓకే చెయ్యట్లేదు. వచ్చిన కథల్లో ఆ పాత్రకి నేను సూట్‌ అవుతాను అనుకుంటేనే ఓకే చేస్తున్నాను. సక్సెస్‌ అనేది నా చేతిలో ఉండదు. ప్రస్తుతం రవితేజ గారి సరసన ‘రావణాసుర’ సినిమాలో చేస్తున్నాను. ఓటీటీ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నాయి. త్వరలో ఓటీటీలో కూడా ఎంట్రీ ఇస్తాను” అని తెలిపింది.