కన్నా కు బుగ్గన  సవాల్ 

  • Published By: murthy ,Published On : May 1, 2020 / 11:19 AM IST
కన్నా కు బుగ్గన  సవాల్ 

కరోనా  వైరస్ పరీక్షల కిట్లు కొనుగోలు కంపెనీలో తాను డైరెక్టర్ ను కాదని…. సదరు  కంపెనీలో తాను డైరెక్టర్ నని రుజువు చేస్తే  మే 2 వతేదీ,శనివారం, ఉదయం9 గంటలకు రాజీనామా చేస్తానని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణకు సవాల్ విసిరారు. కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలు అంశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ తనపై చేసిన ఆరోపణలపై బుగ్గన స్పందించారు.

 
కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా దక్షిణ కొరియా నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఒక్కో కిట్‌కు రూ. 730 చొప్పున మొదట లక్ష కిట్లను దిగుమతి చేసుకున్న  జగన్ ప్రభుత్వం… రెండు లక్షల కిట్ల కొనుగోలుకు ఇచ్చిన పర్చేజ్‌ ఆర్డర్‌లో ప్రత్యేకమైన క్లాజ్‌ను పెట్టింది. దేశంలో ఎవరకి తక్కువ ధరకి అమ్మితే అదే ధరను చెల్లిస్తామని షరతు కూడా విధించింది.(వలస కార్మికుల కోసం జగన్ సర్కార్  కీలక నిర్ణయం..)

ఈ క్రమంలో  బీజేపీ నాయకుడు కన్నా లక్ష్మీ నారాయణతో సహా పలువురు టీడీపీ  నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అయితే ర్యాపిడ్‌ కిట్ల కొనుగోలు డాక్యుమెంట్లను ప్రభుత్వం విడుదల చేయడంతో వీరి తప్పుడు ప్రచారం బట్టబయలైంది. ఇదిలా ఉండగా….కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఇప్పటికే దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మరో ఘనత సొంతం చేసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు లక్షకుపైగా టెస్టులు నిర్వహించినట్టు ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించింది.