iPhones SIM slot : 2022లో సిమ్ కార్డు స్లాట్ లేకుండానే ఐఫోన్ మోడల్స్.. కాల్స్ చేసుకునేదెలా?

ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లలో రాబోయే కొత్త మోడల్స్ సిమ్ కార్డు స్లాట్ లేకుండానే రానున్నాయి. 2022 సెప్టెంబర్ నాటికి కొత్త ఐఫోన్ మోడల్స్ సిమ్ కార్డ్ స్లాట్ లేకుండానే లాంచ్ చేయనుంది ఆపిల్.

iPhones SIM slot : 2022లో సిమ్ కార్డు స్లాట్ లేకుండానే ఐఫోన్ మోడల్స్.. కాల్స్ చేసుకునేదెలా?

Apple To Launch Iphones Without Sim Card Slot By September 2022 Report

iPhones SIM slot : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్లలో రాబోయే కొత్త మోడల్స్ సిమ్ కార్డు స్లాట్ లేకుండానే రానున్నాయి. వచ్చే ఏడాది 2022 సెప్టెంబర్ నాటికి ఆపిల్ కొత్త ఐఫోన్ మోడల్స్ సిమ్ కార్డు స్లాట్ లేకుండానే లాంచ్ చేయనుంది. eSIM-only స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసే దిశగా ఆపిల్ కంపెనీ సన్నాహాలు ప్రారంభించింది. 2023 ఏడాదిలో ఆపిల్ లాంచ్ చేయబోయే iPhone 15pro మోడ‌ల్స్‌లో ఫిజిక‌ల్ సిమ్ కార్డ్ స్లాట్ (Sim card Slot) ఉండదని బ్రెజిలియ‌న్ వెబ్‌సైట్ MacRumors రిపోర్టు ఒక ప్రకటనలో వెల్లడించింది.

2022 సెప్టెంబ‌ర్ నుంచి ఆపిల్ eSIM-only స్మార్ట్‌ఫోన్ల‌నే మాత్రమే లాంచ్ చేయనున్నట్టు నివేదిక పేర్కొంది. ఇప్పటికే iPhone 13 మోడళ్లను ఆపిల్ స్టోర్లు లేదా Apple.com లో nano-SIM card లేకుండానే అమ్మేసింది. ఇలాంటి మోడల్ ఐఫోన్లలో సెల్యులర్ ప్లాన్ eSIM విధానం ద్వారా (Turn On) యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. Wi-Fi నెట్ వర్క్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు.. ఆన్ స్ర్కీన్ ఆప్షన్ల ద్వారా ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు.  2022 సెప్టెంబర్ చివరిలోగా ఫిజికల్ సిమ్ కార్డ్ స్లాట్ ఐఫోన్ మోడళ్లను ఆపిల్ నిలిపివేసే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి.

అయితే ఆ ఫోన్ల స్థానంలో iPhone 14 మోడళ్లలో eSIM స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేయాలని ఆపిల్ భావిస్తోంది. ఆ తర్వాత కొన్ని ఐఫోన్ 15 మోడళ్లలోనూ సిమ్ స్లాట్ లేకుండానే తీసుకురానున్నట్టు రిపోర్టు తెలిపింది. సిమ్ కార్డ్ స్లాట్ తొల‌గిస్తే.. వాట‌ర్ రెసిస్టెన్స్ పర్పార్మెన్స్ పెరగనుంది. వ‌చ్చే ఏడాది ఐఫోన్ మోడళ్లలో ఆపిల్ QLC Flash Storage తీసుకురానుంది. ఐఫోన్ న్యూ మోడ‌ల్స్‌లో 48MP కెమెరా లెన్స్‌ను తీసుకురానుంది. 2023 ఐఫోన్ మోడ‌ల్స్‌లో పెరిస్కోప్ లెన్స్ కూడా తీసుకొచ్చేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది.


డ్యూయ‌ల్ సిమ్ ఫీచ‌ర్‌ సాయంతో రెండు eSIM కార్డ్‌ల‌ను స‌పోర్ట్ చేసేలా ఐఫోన్ మోడ‌ల్స్ మార్కెట్లోకి ఆపిల్ లాంచ్ చేసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే eSIM విధానం అన్ని దేశాల్లో అందుబాటులో లేదు. మిగిలిన అన్ని దేశాల మార్కెట్లో మాత్రం ఐఫోన్ సిమ్ కార్డు స్లాట్ తోనే మోడళ్లను లాంచ్ చేయనుంది.

2022 నాటికి యూకేలో మూడు, న్యూజిలాండ్ లో వోడాఫోన్ సపోర్టు చేసేలా మోడళ్లను లాంచ్ చేసేందుకు ఆపిల్ ప్లాన్ చేస్తోంది. iPhone 13 మోడల్స్ మల్టీపుల్ eSIM ప్రొఫైళ్లకు సపోర్టు చేసేలా ఆపిల్ రూపొందించింది. డిజిటల్‌గా ఐఫోన్ యూజర్లు సెల్యులర్ నెట్‌వర్క్‌కు కనెక్టింగ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. తమకు అవసరమైన నెట్ వర్క్ కు స్విచ్ కావొచ్చు. ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే ఈ తరహా eSIM విధానానికి సపోర్టు చేసే ఐఫోన్ మోడళ్లను ఆపిల్ లాంచ్ చేయనుంది.

Read Also : Earphones washing machine: బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కోసం వాషింగ్ మెషిన్