Rajnath Singh: సాయుధ బలగాల్లో మహిళలకు అధిక భాగస్వామ్యం కల్పిస్తాం: రాజ్ నాథ్ సింగ్

"నేడు సైన్యంలో ప్రతి విభాగంలో మహిళలు పనిచేస్తున్నారని, వారికి సైన్యంలో శాశ్వత కమిషన్ కూడా ఇస్తున్నామని అన్నారు.

Rajnath Singh: సాయుధ బలగాల్లో మహిళలకు అధిక భాగస్వామ్యం కల్పిస్తాం: రాజ్ నాథ్ సింగ్

Raj Nath

Rajnath Singh: కేంద్ర ప్రభుత్వం, రక్షణశాఖ ఆధ్వర్యంలో ఇటీవల తీసుకున్న నిర్ణయాల కారణంగా రాబోయే రోజుల్లో సాయుధ బలగాల్లో మహిళలకు అధిక భాగస్వామ్యం కల్పించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఒ) ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ “నేడు సైన్యంలో ప్రతి విభాగంలో మహిళలు పనిచేస్తున్నారని, వారికి సైన్యంలో శాశ్వత కమిషన్ కూడా ఇస్తున్నామని అన్నారు. ప్రతి సైనిక్ పాఠశాలలో బాలురతో పాటు బాలికలకు సరిసమానమైన ప్రవేశం కల్పిస్తున్నట్లు రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. భారత సైన్యంలో చేరేందుకు గత ఏడాది సుమారు రెండు లక్షల మంది మహిళలు ఎంతో ఉత్సాహంతో ప్రవేశ పరీక్ష రాశారని.. దీంతో రాబోయే కాలంలో భారత సైన్యంలో మహిళల శాతం గణనీయంగా పెరుగుతుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో చేరి దేశ సేవ చేయాలనీ భావించే మహిళల కోసం తమ పార్టీ తలుపులు కూడా తెరిచి ఉంచామని ఆయన అన్నారు.

Also read: Heatwave in Country: ముంబై, ఢిల్లీ నగరాల్లో వేడి సెగలు: ముంబైలో యెల్లో అలర్ట్

75 సంవత్సరాల దేశ స్వాతంత్య్రన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘ఉమెన్ ట్రాన్స్ ఫార్మింగ్ ఇండియా’ అనే థీమ్ తో ‘మహిళల పండుగ'(Celebrating Women’) అనే కార్యక్రమాన్ని ఫిక్కీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వ్హలించారు. ఈకార్యక్రమానుద్దేశించి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ నిర్వాహకులను ప్రశంసించారు. దేశ సంపూర్ణ అభివృద్ధికి పురుషులు మరియు మహిళలు సమాన సహకారం అందిస్తున్న ‘న్యూ ఇండియా’కు చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఎఫ్ఎల్ఓను అభినందించారు. వేద కాలం నుండి భారతదేశంలో మహిళలకు సమాన గౌరవం ఇవ్వబడిందని, సమాజ అభ్యున్నతిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిని తీర్చి దిద్దడంలో మహిళలు నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు.

Also read: Jagananna Vidya Deevena Money : సీఎం జగన్ గుడ్‌న్యూస్.. రేపే ఖాతాల్లోకి డబ్బులు