Vacant Posts: కేంద్ర ఉద్యోగాల్లో 9.79 లక్షల ఖాళీలు: ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో ప్రభుత్వం తాజాగా వెల్లడించింది. లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్రం మంత్రి జితేంద్ర సింగ్ ఈ వివరాలు వెల్లడించారు.

Vacant Posts: కేంద్ర ఉద్యోగాల్లో 9.79 లక్షల ఖాళీలు: ప్రకటించిన కేంద్రం

Vacant Posts

Vacant Posts: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో మార్చి 1, 2021 నాటికి దాదాపు 9.79 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ వివరాల్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ బుధవారం లోక్‌సభలో వెల్లడించారు. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దేశవ్యాప్తంగా 40,35,203 ఉద్యోగాలు ఉండగా, గత ఏడాది మార్చి నాటికి 30,55,876 ఉద్యోగులు పనిచేస్తున్నట్లు తెలిపారు. అనేక మంత్రిత్వ శాఖలు, విభాగాలు, అనుబంధ విభాగాల పరిధిలో ఈ ఉద్యోగాలున్నాయి. ఖాళీ అయిన ఉద్యోగాల్ని భర్తీ చేయడం నిరంతర ప్రక్రియ అని, ఇది ప్రభుత్వ బాధ్యత అని జితేంద్ర సింగ్ అన్నారు.

KS Eshwarappa: కాంట్రాక్టర్ ఆత్మహత్య కేసులో కర్ణాటక మాజీ మంత్రికి క్లీన్‌చిట్

ఉద్యోగుల రిటైర్మెంట్, ప్రమోషన్స్, రాజీనామాలు, మరణాలు, ఇతర కారణాల వల్ల ఈ ఖాళీలు ఏర్పడ్డాయని ఆయన చెప్పారు. కాగా, ఒక ఉద్యమంలా భావించి పది లక్షల ఉద్యోగాల్ని వచ్చే ఏడాదిన్నరలోగా భర్తీ చేయాలని కేంద్ర శాఖలకు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల సూచించారు. కాగా, మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో 30,87,278 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని, వీరిలో 3,37,439 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారని కేంద్రం ప్రకటించింది.