Asia Cup 2022: ఆసియా క‌ప్ శ్రీ‌లంకలో జ‌రగ‌న‌ట్లే..

శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా క‌ప్‌ను యూఏఈకి మార్చారు. ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌ర‌గాల్సి ఉన్న విష‌యం తెలిసిందే. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు. శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభం కార‌ణంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్న నేప‌థ్యంలో ఆ దేశంలో ఈ మ్యాచులు జ‌రుగుతాయా? అన్న సందేహాలు మొద‌టి నుంచీ ఉన్నాయి.

Asia Cup 2022: ఆసియా క‌ప్ శ్రీ‌లంకలో జ‌రగ‌న‌ట్లే..

Sourav Ganguly

Asia Cup 2022: శ్రీలంక వేదికగా జరగాల్సిన ఆసియా క‌ప్‌ను యూఏఈకి మార్చారు. ఆగ‌స్టు 27 నుంచి సెప్టెంబ‌రు 11 వ‌ర‌కు ఆసియా క‌ప్ టోర్న‌మెంట్ జ‌ర‌గాల్సి ఉన్న విష‌యం తెలిసిందే. దీన్ని టీ20 ఫార్మాట్‌లో నిర్వ‌హిస్తారు. శ్రీ‌లంక‌లో ఆర్థిక సంక్షోభం కార‌ణంగా హింసాత్మ‌క ఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్న నేప‌థ్యంలో ఆ దేశంలో ఈ మ్యాచులు జ‌రుగుతాయా? అన్న సందేహాలు మొద‌టి నుంచీ ఉన్నాయి. శ్రీ‌లంకలో ఆసియా క‌ప్ నిర్వ‌హించ‌లేని ప‌రిస్థితి ఉంటే భార‌త్‌లో నిర్వ‌హిస్తారన్న ఊహాగానాలు వ‌చ్చాయి.

దీనిపై బీసీసీఐ అధ్య‌క్షుడు సౌరవ్ గంగూలీ స్పందిస్తూ స్ప‌ష్ట‌త‌నిచ్చారు. ఆసియా క‌ప్ యూఏఈలో జ‌రుగుతుంద‌ని చెప్పారు. యూఏఈలో వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలు లేక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వివరించారు. మరోవైపు, త‌మ దేశంలో ఆసియా క‌ప్ నిర్వ‌హించ‌లేమ‌ని ఆసియ‌న్ క్రికెట్ కౌన్సిల్‌(ఏసీసీ)కి కూడా శ్రీ‌లంక క్రికెట్ (ఎస్ఎల్‌సీ) స్ప‌ష్టం చేసింది. శ్రీలంక‌లో ఆర్థిక, రాజకీయ సంక్షోభం నెల‌కొన్న నేప‌థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు వివ‌రించింది. లంక ప్రీమియ‌ర్ లీగ్ (ఎల్పీఎల్‌)ను కూడా శ్రీ‌లంక క్రికెట్ వాయిదా వేసింది.

Droupadi Murmu: ఆక‌ట్టుకునేలా ద్రౌప‌ది ముర్ము సైకత శిల్పాన్ని రూపొందించిన సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్