Mary Kom : ఫైనల్ లో ఓడిన భారత స్టార్ బాక్సర్

Mary Kom : ఫైనల్ లో ఓడిన భారత స్టార్ బాక్సర్

Mary Kom

Updated On : May 31, 2021 / 6:31 AM IST

Asian Boxing Championships 2021 : ఆసియా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ పరాజయం పాలైంది. 2021, మే 30వ తేదీ ఆదివారం దుబాయ్ వేదికగా…కజకిస్తాన్ క్రీడాకారిణి నాజిమ్ తో తలపడ్డారు. ఈ తుదిపోరులో 2-3తో మేరీకోమ్ ఓటమిపాలైంది. దీంతో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఐదుసార్లు స్వర్ణ పతకాలు సాధించారు మేరీకోమ్. అయితే..కజక్ కు గట్టిగా పోటీనివ్వలేకోపోయారు. మొదటి రౌండ్ హోరాహోరీగా కొనసాగింది.

రెండో రౌండ్ వచ్చేసరికి మేరీకోమ్ కాస్త మెత్తబడినట్లుగా కనిపించారు. నాజిమ్ తన పంచ్ లతో ముంచెత్తడంతో మేరీకోమ్ ధీటుగా సమాధానం ఇవ్వలేకపోయారు. దీంతో ఆమె పరాజయం చెందారు. 2008 ఆసియా చాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఓడిన మేరీకోమ్‌కు ఈ టోర్నీలో ఇది రెండో రజతం.

Read More :  Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ నిర్ణయాలు..వైద్య ఆరోగ్య శాఖకు వెయ్యి కోట్లు, ఏడు మెడికల్ కాలేజీలు