Pak Embassy: వీసా ఇంటర్వ్యూలో సెక్స్ గురించి అడిగారు.. పాక్ రాయబారిపై పంజాబ్ ప్రొఫెసర్ ఆరోపణ

పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ 2021లో పాకిస్తాన్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును పరిశీలించిన పాక్ రాయబార కార్యాలయ అధికారులు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహించారు.

Pak Embassy: వీసా ఇంటర్వ్యూలో సెక్స్ గురించి అడిగారు.. పాక్ రాయబారిపై పంజాబ్ ప్రొఫెసర్ ఆరోపణ

Pak Embassy: ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయ అధికారులపై పంజాబ్‌కు చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ సంచలన ఆరోపణలు చేసింది. పాకిస్తాన్ వెళ్లేందుకు నిర్వహించిన ఇంటర్వ్యూలో తనను సెక్స్ గురించిన ప్రశ్నలు అడిగినట్లు వెల్లడించింది.

Nupur Sharma: బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మకు గన్ లైసెన్స్ మంజూరు

ఈ అంశంపై ఆమె కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రస్తుతం ఈ శాఖ విచారణ జరపనుంది. పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఒక మహిళా ప్రొఫెసర్ 2021లో పాకిస్తాన్ వెళ్లేందుకు వీసా కోసం దరఖాస్తు చేసుకుంది. ఆమె దరఖాస్తును పరిశీలించిన పాక్ రాయబార కార్యాలయ అధికారులు ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెను పాక్ ఎందుకు వెళ్లాలనుకుంటున్నావని ప్రశ్నించారు.

Jammu and Kashmir: కాశ్మీర్‌‌లో హిమపాతం.. ఒకరి మృతి.. మరొకరు గల్లంతు

దీనికి ఆమె తానొక ప్రొఫెసర్ అని, లాహోర్‌‌లోని చారిత్రక ప్రదేశాల్ని పరిశీలించాలి అనుకుంటున్నానని తెలిపింది. అలాగే అక్కడి యూనివర్సిటీలో లెక్చర్ కూడా ఇవ్వబోతున్నట్లు చెప్పింది. ఇంటర్వ్యూ ముగిసే సమయానికి మరో అధికారి కలుగజేసుకుని, వ్యక్తిగత ప్రశ్నలు అడిగాడు. ఆ మహిళా ప్రొఫెసర్‌‌ను ఎందుకు పెళ్లి చేసుకోలేదని ప్రశ్నించాడు ఆ అధికారి. పెళ్లి చేసుకోకుండా ఎలా ఉంటున్నారని, సెక్స్ కోరికలు ఎలా తీర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నలతో తాను చాలా ఇబ్బందిపడినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ప్రస్తుతం అధికారులు విచారణ జరుపుతున్నారు.