5 states Assembly Elections 2022: ఐదురాష్ట్రాల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువత..ఎంతమందంటే..

ఐదురాష్ట్రాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువత..ఎంతమందంటే..

5 states Assembly Elections 2022: ఐదురాష్ట్రాల్లో మొదటిసారి ఓటు వేయనున్న యువత..ఎంతమందంటే..

5 States Assembly Elections 2022 (1)

5 states Assembly Elections 2022: ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు కావటంతో ఆయా రాష్ట్రాల్లో ఆయా పార్టీల నేతలు ప్రచారాలు మమ్మరం చేశారు.ఈ ఎన్నికల్లో లక్షలాదిమంది యువత మొదటిసారిగా తమ ఓటుహక్కుని వినియోగించుకోనున్నారు. ఐదు రాష్ట్రాల్లో ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఐదు రాష్ట్రాల ఫలితాలు మార్చి 10న వెలువడనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహించే క్రమంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర మీడియాతో మాట్లాడుతూ..యువత తమ ఓటుహక్కుని వినియోగించటానికి సిద్ధమయ్యారని..అలా ఓటుహక్కు పొంది తొలిసారిగా 24.9 లక్షల మంది యువత తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు.

Also read :Manipur : అమిత్ షా చెప్పులు వేసుకోవచ్చు గానీ..స్థానిక నేతలు బూట్లు వేసుకోకూడదా..? : రాహుల్ గాంధీ 

కాగా..ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ నుంచి ఎన్నికలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో యూపీలో పోలింగ్ జరగనుంది. ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఉత్తరాఖండ్, పంజాబ్, గోవాలలో ఒకే దశలో ఫిబ్రవరి 14న ఓటింగ్ జరగనుంది. మణిపూర్‌లో ఫిబ్రవరి 27, మార్చి 3న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మొదటి దశ ఫిబ్రవరి 10న, రెండో దశ ఫిబ్రవరి 14న, మూడో దశ ఫిబ్రవరి 20న, నాలుగో దశ ఫిబ్రవరి 23న, ఫిబ్రవరి 27న, మార్చి 3న, మార్చి 7న ఎన్నికలు జరగనున్నాయి.

Also read :Manipur Election : బీజేపీ తొలి‘మణి’పూస..కౌన్సిలర్‌ టూ అధ్యక్షురాలిగా శారదాదేవి..అసమ్మతి సెగ అధిగమించి..గెలుపు సాధించేనా?

ఐదు రాష్ట్రాల్లోని 690 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ జరగనుంది. దీంట్లో భాగంగా 18.34 కోట్ల మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారని ఈసీ అధికారి తెలిపారు. ఈ 18.34 కోట్ల మంది ఓటర్లలో 8.55 కోట్ల మంది మహిళలు ఉన్నారని తెలిపారు. అలాగే తొలిసారిగా 24.9 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారని..ఐదు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల కోసం 2,15,368 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.అలాగే కరోనా నిబంధనలు తప్పనిసరి అని స్పష్టంచేశారు. కరోనా నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించనున్నామని..అన్ని నిబంధనలను పాటించి ఓటర్లు తమ ఓటుహక్కుని వినియోగించుకోవాలని కోరారు.