Manipur Election : బీజేపీ తొలి‘మణి’పూస..కౌన్సిలర్‌ టూ అధ్యక్షురాలిగా శారదాదేవి..అసమ్మతి సెగ అధిగమించి..గెలుపు సాధించేనా?

బీజేపీ తొలి ‘మణి’పూస..కౌన్సిలర్‌ టూ అధ్యక్షురాలిగా శారదాదేవి అసమ్మతి సెగ అధిగమించి..గెలుపు సాధించేనా? ఈ ఎన్నికల్లో ఆమె నేతృత్వంలో బీజేపీ విజయం సాధిస్తుందా? అనేది వేచి చూడాలి.

Manipur Election : బీజేపీ తొలి‘మణి’పూస..కౌన్సిలర్‌ టూ అధ్యక్షురాలిగా శారదాదేవి..అసమ్మతి సెగ అధిగమించి..గెలుపు సాధించేనా?

Manipur Bjp President Sharada Devi Political Profile

Manipur BJP President Sharada Devi Political Election Challenges : ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో మణిపూర్‌ రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత చాలా చాలా తక్కువ. అటువంటి సమయంలో ఓ మహిళ బీజేపీ పగ్గాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కౌన్సిలర్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఎదిగిన శారదాదేవి తీవ్రంగా శ్రమిస్తున్నారు. అన్ని తానై..అన్నింటా తానై గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఓ మహిళకు బీజేపీ పగ్గాలు దక్కటం..పైగా ఈ ఎన్నికల్లో కొంతమంది మహిళలకు శారదాదేవి పట్టు పట్ట మరీ టిక్కెట్లు ఇప్పించటంతో స్వంత పార్టీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. వీటిన్నింటి అధిగమించి శారదాదేవి కమలాన్ని గెలిపించేనా? అసమ్మతి సెగలు అధిగమించి తాను అనుకున్నది సాధించి అధిష్టానం దృష్టిలో మరో మెట్టు ఎక్కుతారా? అనేది ఇప్పుడు మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారింది.

Also read : Uttarakhand Elections : యమకేశ్వర్‌ ప్రత్యేకత..20 ఏళ్లుగా ‘ఆమె’కే పట్టం కడుతున్న ఓటర్లు..

మణిపూర్ మణిపూస అంటే ఠక్కున గుర్తుకొచ్చేది బాక్సింగ్ లో సంచలనం సృష్టించిన మేరీకోమ్. బాక్సింగ్ లో చరిత్ర క్రియేట్ చేసి మణిపూర్ కే వన్నె తెచ్చిన గొప్ప క్రీడాకారిణి. ఎటువంటి ప్రోత్సాహాలు లేని క్లిష్ట సమయంలోనే మణిపూర్ మణిపూసగా చరిత్ర క్రియేట్ చేశారు మేరికోమ్. ఇక రాజకీయాల విషయంలోకొస్తే మణిపూర్ లో పురుషుల కంటే మహిళల జనాభా ఎక్కువే అయినా అక్కడ మహిళల ప్రాతినిధ్యం కూడా తక్కువే. ఏ పార్టీ కూడా మహిళలకు తగినంత ప్రాధాన్యం ఇవ్వదు. అటువంటి సమయంలో మహిళా ఓటర్లే లక్ష్యంగా బీజేపీ తొలిసారిగా ఒక మహిళకి రాష్ట్ర పగ్గాలు అప్పగించింది.

అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని మరింతగా పెంచుకునేలా బీజేపీ కోసం శారదాదేవి మణిపూర్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో మహిళా నేతలు పెద్దగా కనిపించడం లేదు. మణిపూర్‌లో మాత్రం అన్నీ తానై, అంతటా తానై శారద బీజేపీ గెలుపు భారాన్ని తన భుజస్కంధాలపై మోస్తున్నారు. రాత్రి పగలు తీవ్రంగా శ్రమిస్తున్నారామె. కౌన్సిలర్ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలిగా శారదాదేవి ప్రస్థానం ఏంటో ఈ ఎన్నికల సందర్భంగా తెలుసుకుందాం..

Also read : Afghan Taliban : తాలిబన్ల తీరు మారలేదు..ప్రజలు ఆకలితో అల్లాడుతున్నా..దారుణాలు ఆపలేదు : ఐరాస కార్యదర్శి ఆవేదన

శారదా దేవి 1995 జూన్‌లో బీజేపీలో చేరారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన శారదాదేవి వార్డు నెం.7 నుంచి కౌన్సిలర్‌గా గెలిచారు. అలా ఆమె గెలుపు రాష్ట్ర అధ్యక్షురాలి స్థాయి వరకు చేర్చింది. దానికి ఆమె కృషి కూడా తోడైంది. అధిష్టాం నమ్మకాన్ని గెలుచుకుని అధ్యక్షురాలి స్థాయికి ఎదిగారు.

అలా తన కృషితో బీజేపీలో పలు కీలక పదవులు నిర్వహించారు. 1997–2000 వరకు జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. 2010–2012 వరకు జాతీయ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు.

2012–2016 వరకు జాతీయ కార్యనిర్వాహక కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. మణిపూర్‌ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించిన శారదాదేవి కృషిని అధిష్టానం గుర్తించింది. అలా బీజేపీ రాష్ట్ర కోర్‌ కమిటీ, టికెట్‌ కమిటీలో 1998 సంవత్సరం నుంచి సభ్యురాలిగా కొనసాగుతున్నారు.

మణిపూర్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.టికెన్‌ కోవిడ్‌–19 బారిన పడి గత ఏడాది మేలో మరణించారు. దీంతో శారద 2021, జూన్‌లో బీజేపీ రాష్ట్ర తొలి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు.

బహుముఖ పోటీ నెలకొన్న మణిపూర్‌లో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి బీజేపీ వ్యూహాత్మకంగానే బీజేపీ ఎన్నికలకు ముందు సంవత్సరం ఒక మహిళని అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టిందన్న విశ్లేషణలున్నాయి.

రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 20,34,966 ఉంటే వారిలో పురుష ఓటర్లు 9,85,119 మంది ఉంటే మహిళా ఓటర్లు 10,49,639 ఉన్నారు. అంటే మహిళా ఓటర్లు 64 వేల మంది ఎక్కువ ఉన్నట్టు లెక్క. ప్రతీ నియోజకవర్గంలోనూ మహిళా ఓటర్లు కీలకమైన నేపథ్యంలో శారదా దేవి నియామకం పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

మొత్తం 60 స్థానాలున్న రాష్ట్రంలో తాను చెప్పిన వారికి టికెట్లు ఇస్తే 40 సీట్లలో విజయం ఖాయమని శారదా దేవి చెప్పారు. మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నప్పటికీ దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం లేదు. 2017 ఎన్నికల్లో కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే అసెంబ్లీలో అడుగు పెట్టారు.

శారద పట్టుబట్టి ముగ్గురు మహిళా అభ్యర్థులకి టికెట్లు ఇప్పించారు. ఇప్పటికే బహుముఖ పోటీ నెలకొనడంతో పాటు టికెట్ల పంపిణీ తర్వాత బీజేపీలో ఒక్కసారిగా అసమ్మతి సెగ రాజుకుంది. టికెట్లు రాని వాళ్లు పార్టీ కార్యాలయం మీద కూడా దాడులకు దిగారు. కొందరు పార్టీకి కూడా ఉద్వాసన చెప్పేశారు.

పార్టీలో అసమ్మతిదారుల్ని బుజ్జగించడంతో పాటు 40 సీట్ల లక్ష్యాన్ని సాధించడం అంటే శారదా దేవి గట్టి సవాల్‌ అనే చెప్పాలి. అయినా శారదాదేవి ఏమాత్రం తగ్గటంలేదు. క్యాడర్ కు ఎప్పటికప్పుడు దిశా నిర్ధేశం చేస్తు ముందుకు కొనసాగుతున్నారు. కార్యకర్తలతో చక్కగా కలిసిపోతు అందరికి అందుబాటులో ఉంటే క్యాడర్ నమ్మకాన్ని కూడా గెలుచుకుంటున్నారు. ఎటువంటి అరమరికలు లేకుండా కలిసిపోయే తత్వం వల్ల అందరు తమ అభిప్రాయాలను ఆమెతో నిరభ్యంతరంగా పంచుకుంటున్నారు. దీంతో ఆమె మరింత ఉత్సాహంతో ముందుకు సాగిపోతున్నారు. శారదదేవి నేతృత్వంలో బీజేపీని క్షేత్రస్థా యిలో పటిష్టపరుస్తుందని అందరూ నమ్ముతున్నారు. మరి ఓవైపున అసమ్మతి సెగను అధిగమిస్తునే మరోపక్క ఏమాత్రం తగ్గని ఉత్సాహంతో శారదాదేవి ముందుకు ఉరకలేస్తున్నారు.