Balakrishna: తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై బాలయ్య.. మామూలుగా ఉండదట!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా....

Balakrishna: తెలుగు ఇండియన్ ఐడల్ స్టేజ్‌పై బాలయ్య.. మామూలుగా ఉండదట!

Balakrishna: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీని దర్శకుడు గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఇందులో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత బాలయ్య తన నెక్ట్స్ చిత్రాన్ని మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్‌ను ఫిక్స్ చేసిన అనిల్..?

కాగా గతంలో బాలయ్య ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం కోసం ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోకు తొలిసారి హోస్ట్‌గా వ్యవహరించాడు. ఈ టాక్ షోకు ప్రేక్షకుల దగ్గర్నుండి అదిరిపోయే రెస్పాన్స్ దక్కింది. ఇక ఈ టాక్ షోకు రెండో పార్ట్‌ను రెడీ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. అయితే మరోసారి బాలయ్య ఓ రియాలిటీ షోలో తన సత్తా చాటినట్లు తెలుస్తోంది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో తెలుగు ఇండియన్ ఐడల్ అనే షోకు ముఖ్య అతిథిగా బాలకృష్ణ హాజరయ్యారు. ఈ ప్రోగ్రామ్ సెమీ ఫైనల్‌కు చేరుకోవడంతో, షో నిర్వాహకులు ఈ స్పెషల్ ఎపిసోడ్‌కు బాలయ్యను చీఫ్ గెస్ట్‌గా పిలిచారు.

Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!

ఇక ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను మరింత స్పెషల్‌గా చేశారట బాలయ్య. ఈ షోలో బాలయ్య ఓ అదిరిపోయే సాంగ్‌కు డ్యాన్స్ చేసి స్టేజీపై మంటలు పుట్టించారట. తెలుగు ఇండియన్ ఐడల్ షోకు థమన్, నిత్యా మీనన్, కార్తీక్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తుండగా, శ్రీరామ చంద్ర ఈ షోను హోస్ట్ చేస్తున్నాడు. ఈ స్పెషల్ ఎపిసోడ్‌ను జూన్ 10న ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. దీంతో ఈ ఎపిసోడ్ కోసం బాలయ్య అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.