Bamboo bridge: వరుడి రాక కోసం రాత్రికిరాత్రే కాలువపై వెదురు వంతెన

ఇటీవలికాలంలో పెళ్ళిళ్ళలో అనే వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లాంటి ప్రాంతాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో వెలుగు చూసే ఘటనలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.

Bamboo bridge: వరుడి రాక కోసం రాత్రికిరాత్రే కాలువపై వెదురు వంతెన

వరుడి రాక కోసం వెదురు వంతెన

Bamboo bridge: ఇటీవలికాలంలో పెళ్ళిళ్ళలో అనే వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. బీహార్ లాంటి ప్రాంతాల్లో పెళ్ళిళ్ళ సందర్భంలో వెలుగు చూసే ఘటనలు చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. గతంలో వదువును ఎత్తుకుని వరుడు కాలువ దాటించటం.. వదువును పడవలో వరుడు ఇంటికి తీసుకువెళ్ళటం వంటి అనూహ్య ఘటనలు చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. అయితే తాజాగా బీహార్ లో ఓ పెళ్ళి వేడుక సందర్భంగా వధువు తరుపువారు చేసిన ఏర్పాట్లను చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుక మానదు..

బీహార్ లోని అరరియాలోని ఫుల్సర గ్రామానికి చెందిన బతేష్ తన కుమార్తె రాఖీ కుమారికి వివాహం నిశ్చయించారు. వరుడు సమీపంలోని రామాయి గ్రామానికి చెందిన అమరేంద్ర. వివాహ తేది కూడా ఖరారు కావటంతో ఏర్పాట్లన్నింటిని వధువు తరుపువారు పూర్తిచేశారు. అయితే వీరికి ఓ చిన్న చిక్కొచ్చి పడింది. గ్రామానికి వరుడుతోపాటు అతని బంధువర్గం చేరుకోవాలంటే ఓ కాలువను దాటాల్సి ఉంటుంది. పెళ్ళంటే వరుడు తరుపువారు ఊరేగింపుగా హంగుఆర్భాటంతో వస్తారు..వారిని నీరు ప్రవహిస్తున్న కాల్వలో నుండి రమ్మంటే ఏంబాగుంటుందని అనుకున్నారో ఏమో తెలియదుకాని, వధువు కుటుంబసభ్యులు, గ్రామస్తులు అంతా కలసి సమావేశమయ్యారు. కాల్వపై తక్షణమే వెదురు కర్రలతో వంతెన నిర్మించాలని నిర్ణయించుకున్నారు.

అనుకున్నదే తడువుగా అంతా రంగంలోకి దిగారు. వంతెన నిర్మాణానికి కావాల్సిన వెదురు బంగులతోపాటు ఇతర సరంజామా మొత్తాన్ని గంటల వ్యవధిలోనే సిద్ధం చేసుకున్నారు. ఇక తెల్లవారితే వివాహ ఘడియలు.. ఇంకేముంది అంతా కలసి రాత్రికి రాత్రే వెదురు వంతెనను సిద్ధం చేశారు. పట్టుదలతో గంటల వ్యవధిలోనే నిర్మించిన వెదురు వంతెనను చూసి అంతా ఆశ్ఛర్యపోయారు. పెళ్ళి సమయం రానే వచ్చింది. వరుడు తన బంధువులతో కలసి రామాయి గ్రామం నుండి ఊరేగింపుగా బయలు దేరాడు, గ్రామ ప్రవేశించే సమయంలో వరుడిని ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని వెదురు వంతెన పై నుండి పెళ్ళి మండపానికి ఘనంగా తీసుకువచ్చారు. వరుడు బంధువులు సైతం అదే వంతెనపై ఏంచక్కా నడుచుకుంటూ ఆనందంగా వేడుకకు హాజరయ్యారు.

పెళ్ళికోసం కాలువపై ఒక్కరాత్రిలో వెదురు వంతెన నిర్మించిన విషయం తెలుసుకుని వరుడి బంధువులు ఆశ్చర్యపోయారు. వంతెన అంత బలంగా లేకపోయినప్పటికీ మనుషులు, ద్విచక్రవాహనాలు వెళ్లేందుకు వీలుగా ఉంది. గ్రామానికి చేరుకునేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవటం వల్లే వారు కాల్వపై వెదురు వంతెన నిర్మించాల్సి వచ్చింది. ప్రస్తుతం బీహార్ లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఒక రకంగా బీహార్ గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ఎత్తి చూపేలా ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.