Bandi Sanjay: హైకోర్టుకు చేరిన బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్

కరీంనగర్ లో తనపై నమోదు చేసిన కేసుపై విచారించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బండి సంజయ్. కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తనపై ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ ..

Bandi Sanjay: హైకోర్టుకు చేరిన బండి సంజయ్ లంచ్ మోషన్ పిటిషన్

Bandi Sanjay

Updated On : January 4, 2022 / 3:55 PM IST

Bandi Sanjay: కరీంనగర్ లో తనపై నమోదు చేసిన కేసుపై విచారించాలంటూ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు బండి సంజయ్. కరీంనగర్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తనపై ఇచ్చిన రిమాండ్ ఆర్డర్‌ను క్వాష్ చేయాలనీ కోరారు. తనపై నమోదై ఉన్న ఐపీసీ 333సెక్షన్ ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు.

హైకోర్టును అభ్యర్థిస్తూ.. అత్యవసర విచారణ చేపట్టాలని కోరడంతో న్యాయస్థానం అంగీకరించింది. ఎమ్మెల్యే, ఎంపీలకు సంబంధించిన కేసుల విచారణకు తనకు రోస్టర్ లేదని జస్టిస్ పిటిషన్‌ను తిరస్కరిస్తూ.. ప్రజాప్రతినిధులు కేసు కాబట్టి.. ఎమ్మెల్యే, ఎంపీల కేసులు విచారణ జరిపే కోర్టుకు వెళ్ళాలని న్యాయవాదికి సూచించారు.

బండి సంజయ్ క్వాష్ పిటిషన్ తమ పరిధిలోకి రాదని జస్టిస్ లక్ష్మణ్ బెంచ్ తేల్చేయడంతో మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రీజిస్ట్రీకి ఆదేశాలు ఇస్తూ.. జస్టిస్ ఉజ్జన్ బాయాల్ బెంచ్‌కు సిఫార్స్ చేశారు. ఈ మేరకు మరికొద్ది సేపటిలో సంజయ్ పిటిషన్ మేర విచారణ జరగనుంది.

ఇది కూడా చదవండి: గోవా నుంచి బయల్దేరిన షిప్ లో 66మందికి కొవిడ్ పాజిటివ్