Bandi Sanjay: భైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర.. అనుమతి నిరాకరించిన పోలీసులు

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.

Bandi Sanjay: భైంసా నుంచి బండి సంజయ్ పాదయాత్ర.. అనుమతి నిరాకరించిన పోలీసులు

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టాల్సిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. నవంబర్ 28, సోమవారం నుంచి బండి సంజయ్ ఐదో విడత పాదయాత్ర చేపట్టాల్సి ఉంది. నిర్మల్ జిల్లా భైంసా నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం కావాలి.

Honey Trapping: హనీ ట్రాపింగ్‌కు పాల్పడ్డ యూట్యూబ్ కపుల్.. వ్యాపారిని బెదిరించి రూ.80 లక్షలు వసూలు

బాసరలోని అమ్మవారి ఆలయంలో ఉదయం పూజలు నిర్వహించిన అనంతరం, భైంసా చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని బండి సంజయ్ నిర్ణయించారు. అయితే, శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు భైంసాలో ఈ పాదయాత్రకు అనుమతి నిరాకరించారు. ఈ పాదయాత్రకు సంబంధించి ఆదిలాబాద్ నుంచి బీజేపీ తరఫున ఎన్నికైన ఎంపీ సోయం బాపూరావు ఇటీవల పోలీసులను కలుసుకుని అనుమతి కోరారు. అయితే, శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్న దృష్ట్యా పాదయాత్రకు అనుమతి నిరాకరించినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ సురేష్ తెలిపారు.

మరోవైపు ఇప్పటికే ఈ యాత్రకు బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. షెడ్యూల్ ప్రకారం.. బండి సంజయ్ భైంసా చేరుకున్న అనంతరం అక్కడ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ సభకు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కావాల్సి ఉంది.