BAN vs AFG : టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. 21వ శ‌తాబ్దంలో అతి పెద్ద విజ‌యం

టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్(Bangladesh) చ‌రిత్ర సృష్టించింది. 21వ శ‌తాబ్దంలో అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది. అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 546 ప‌రుగుల తేడాతో గెలిచింది.

BAN vs AFG : టెస్టు క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన బంగ్లాదేశ్‌.. 21వ శ‌తాబ్దంలో అతి పెద్ద విజ‌యం

BAN vs AFG

BAN vs AFG Test: టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్(Bangladesh) చ‌రిత్ర సృష్టించింది. 21వ శ‌తాబ్దంలో అతి పెద్ద విజ‌యాన్ని న‌మోదు చేసింది. అఫ్గానిస్థాన్‌(Afghanistan)తో జ‌రిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఏకంగా 546 ప‌రుగుల తేడాతో గెలిచింది. త‌ద్వారా ప‌రుగుల ప‌రంగా భారీ తేడాతో విజ‌యం సాధించిన మూడో జ‌ట్టుగా నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్(England) జ‌ట్టు మొద‌టి స్థానంలో ఉంది. 1928లో ఇంగ్లాండ్ జ‌ట్టు ఆస్ట్రేలియాపై 657 ప‌రుగుల తేడాతో గెలిచింది. 1934లో ఆస్ట్రేలియా జ‌ట్టు ఇంగ్లాండ్ పై 562 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. తాజా గెలుపుతో బంగ్లా మూడో స్థానంలో నిలిచింది.

India tour of West Indies : టెస్టు సిరీస్‌కు రోహిత్, కోహ్లితో పాటు సీనియ‌ర్ల‌కు విశ్రాంతి..? కెప్టెన్‌గా అజింక్య ర‌హానె..?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బంగ్లాదేశ్ మొద‌ట బ్యాటింగ్ చేసింది. నజ్ముల్ హోస్సెన్ షాంటో(146; 175 బంతుల్లో 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) భారీ శ‌త‌కం చేయ‌గా, మహ్మదుల్ హసన్ జాయ్(76), మెహిదీ హసన్ మిరాజ్ (48)లు రాణించ‌డంతో మొద‌టి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 382 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అప్గాన్ బౌల‌ర్ నిజత్ మసూద్ ఐదు వికెట్లు తీశాడు. అనంత‌రం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన అప్గానిస్థాన్ 146 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో బంగ్లాకు 236 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది.

ఆ త‌రువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ 425/4 స్కోర్ వ‌ద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. నజ్ముల్ హోస్సెన్ షాంటో (124; 151 బంతుల్లో 15 ఫోర్లతో ), మోమినుల్ హక్(121 నాటౌట్; 145 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్‌తో ) సెంచ‌రీల‌తో చెల‌రేగారు. దీంతో అఫ్గాన్ ముందు 662 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది. ల‌క్ష్య ఛేద‌న‌లో అఫ్గాన్ జ‌ట్టు 115 ప‌రుగుల‌కే ఆలౌటైంది. టస్కిన్ అహ్మద్ నాలుగు, షోరిఫుల్ ఇస్లామ్ మూడు వికెట్లు తీసి అఫ్గాన్ ప‌త‌నాన్ని శాసించారు. దీంతో బంగ్లాదేశ్ 546 ప‌రుగుల తేడాతో గెలుపొందింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచ‌రీల‌తో చెల‌రేగిన నజ్ముల్ హోస్సెన్ షాంటో కు ‘ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ల‌భించింది.

Double hat-trick : క్రికెట్ చ‌రిత్ర‌లో అరుదైన రికార్డు.. ఆరు బంతుల‌కు 6 వికెట్లు.. అదీ ఒకే ఓవ‌ర్‌లో.. 12 ఏళ్ల కుర్రాడి ఘ‌న‌త‌