Rishabh Pant: “ఫైటర్” రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి.. బీసీసీఐ వీడియో.. ద్రవిడ్ ఏమన్నారంటే?

‘ఫైటర్’ రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కోచ్ రాహుల్ ద్రావిడ్, హార్దిక్ పాండ్యా, యువ క్రికెటర్లు మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

Rishabh Pant: “ఫైటర్” రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలి.. బీసీసీఐ వీడియో.. ద్రవిడ్ ఏమన్నారంటే?

Rishab Pant

Rishabh Pant: టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ విషయం విధితమే. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పంత్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ కోచ్ రాహుల్ ద్రావిడ్, ఇతర యువ క్రికెటర్లు ఆకాంక్షించారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ మంగళవారం తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

Rishabh Pant: రిషబ్ పంత్‌ను ఐసీయూ నుంచి ప్రైవేట్ సూట్‌కు మార్చిన డాక్టర్లు.. సందర్శకుల తాకిడితో విశ్రాంతి కరువైన పంత్

ద్రవిడ్ మాట్లాడుతూ.. పంత్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను. గత ఏడాది కాలంలో భారత టెస్ట్ చరిత్రలో అత్యుత్తమ ఇన్నింగ్స్ లు ఆడడాన్ని చూసే అవకాశం నాకు లభించింది. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడల్లా ఆ క్లిష్టపరిస్థితుల నుంచి బయటపడటంలో పంత్  కీలక పాత్ర పోషించాడని రాహుల్ ద్రవిడ్ గుర్తు చేశారు. క్రికెట్ లో సవాలును స్వీకరించి సమర్థవంతంగా రాణించినట్లుగానే వేగంగా గాయం నుంచి కోలుకొని మళ్లీ జట్టులోకి వస్తారని నమ్మకం ఉందని ద్రవిడ్ అన్నారు.

 

 

స్టార్ ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్, శుభ్‌మాన్ గిల్ కూడా బీసీసీఐ విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ.. పంత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.