power nap: ఆఫీసులో అరగంట నిద్ర.. బెంగళూరు కంపెనీ ఆఫర్

బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఉద్యోగులు ఆఫీసులో నిద్ర పోయేందుకు అంగీకరించింది. రోజూ అరగంటపాటు నిద్రపోవచ్చని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది.

power nap: ఆఫీసులో అరగంట నిద్ర.. బెంగళూరు కంపెనీ ఆఫర్

Power Nap

power nap: ఆఫీసులో పనిచేసేటప్పుడు కొన్నిసార్లు నిద్ర రావడం సహజం. సాధారణంగా వర్క్ అవర్స్‌లో నిద్ర పోయేందుకు కంపెనీలు అంగీకరించవు. అప్పుడప్పుడూ కొన్ని సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలు మాత్రం నిద్ర పోయేందుకు అనుమతిస్తాయి. విదేశాల్లోని చాలా కంపెనీలు ఎప్పట్నుంచో ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తాజాగా బెంగళూరుకు చెందిన ఒక స్టార్టప్ ఉద్యోగులు ఆఫీసులో నిద్ర పోయేందుకు అంగీకరించింది. రోజూ అరగంటపాటు నిద్రపోవచ్చని ఉద్యోగులకు ఆఫర్ ఇచ్చింది. వేక్‌ఫిట్ సొల్యూషన్స్ అనే సంస్థ ఉద్యోగులకు ఈ సౌకర్యాన్ని కల్పిస్తూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ సంస్థ నిద్రకు సంబంధించిన ఉత్పత్తుల తయారీలోనే ఉంది. పరుపులు, పిల్లోస్ వంటివి తయారు చేస్తుంటుంది.

Bangalore Bel : బెంగుళూరు బెల్ లో 91 ఖాళీల భర్తీ

అయితే, పగటి నిద్ర (విశ్రాంతి) విషయంలో ఇన్నాళ్లూ న్యాయం చేయలేకపోయామని, అందుకే ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని కంపెనీ చెప్పింది. దీనివల్లే ఉద్యోగులకు రోజూ అరగంటపాటు కునుకుతీసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. నిద్ర మత్తులో ఉద్యోగులు సరిగ్గా పనిచేయలేరు. అదే కాస్సేపు విశ్రాంతి తీసుకుంటే, మిగతా టైమంతా బాగా పని చేస్తారు. నాసా అధ్యయన ప్రకారం.. 26 నిమిషాల కునుకు తీస్తే, 33 శాతం పనితీరు మెరుగైందట. దీనివల్ల పగటి నిద్ర (కునుకు) ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు.