Best Jio Plans in 2023 : 2023లో బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇదిగో ఫుల్ లిస్టు..!

Best Jio Plans in 2023 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రీపెయిడ్ యూజర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, SMS, డేటా బెనిఫిట్స్ అందించవచ్చు.

Best Jio Plans in 2023 : 2023లో బెస్ట్ జియో ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ కాలింగ్, మరెన్నో డేటా బెనిఫిట్స్.. ఇదిగో ఫుల్ లిస్టు..!

Best Jio plans in 2023 with unlimited calling, data up to 2.5GB, and many more benefits _ Full list

Best Jio Plans in 2023 : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) ప్రీపెయిడ్ యూజర్ల కోసం అనేక రకాల రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తుంది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, SMS, డేటా బెనిఫిట్స్ అందించవచ్చు. జియో యూజర్లు ఇష్టమైన ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్రీగా యాక్సస్ చేసుకోవచ్చు. జియో అన్‌లిమిటెడ్ కాలింగ్, స్పీడ్ ఇంటర్నెట్ లేదా OTT ప్లాన్‌లను పొందవచ్చు. కొన్ని జియో రీఛార్జ్ ప్లాన్లపై వాల్యూను అందించవచ్చు. టెలికాం ఆపరేటర్ అందించే బెస్ట్ ప్లాన్‌లుగా చెప్పవచ్చు. 2023లో ప్రీపెయిడ్ యూజర్ల కోసం జియో రీఛార్జ్ ప్లాన్‌లను వివరంగా పరిశీలిద్దాం.

బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే :
రూ. 299 ప్లాన్ : రిలయన్స్ జియో యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMS, 56GB మొత్తం డేటాతో 2GB రోజువారీ డేటా లిమిట్ పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ జియో యాప్‌లకు కాంప్లిమెంటరీ యాక్సెస్‌ను కూడా అందిస్తుంది.

రూ. 666 ప్లాన్ : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ యూజర్లు 1.5GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 84 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో Jio యాప్‌లకు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో పాటు రోజుకు 100 SMSలను పొందవచ్చు.

Read Also : Best Reliance Jio Plans : రూ. 300 లోపు బెస్ట్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే.. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ డేటా బెనిఫిట్స్ మీకోసం..!

రూ. 719 ప్లాన్ : ఈ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు 84 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో పాటు Jio యాప్‌లకు ఉచిత యాక్సెస్ అందిస్తుంది.

Best Jio plans in 2023 with unlimited calling, data up to 2.5GB, and many more benefits _ Full list

Best Jio plans in 2023 with unlimited calling, data up to 2.5GB

రూ. 749 ప్లాన్ : ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2GB రోజువారీ డేటా లిమిట్, అన్‌లిమిటెడ్ కాలింగ్, 90 రోజుల ప్లాన్ వ్యాలిడిటీతో కాంప్లిమెంటరీ Jio యాప్‌లతో రోజుకు 100 SMSలు ఉన్నాయి.

రూ. 2023 ప్లాన్ : కొత్త ఏడాదిలో 2023ని పురస్కరించుకుని Jio ఈ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ కింద యూజర్లు 2.5GB రోజువారీ డేటా లిమిట్‌తో 630GB డేటాతో 252 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని పొందవచ్చు. వినియోగదారులు జియో యాప్‌లకు ఉచిత యాక్సెస్‌తో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు పొందవచ్చు.

రూ.2999 ప్లాన్ : రూ.2999 ప్లాన్‌పై జియో ప్రత్యేక ఆఫర్‌ను రిలీజ్ చేసింది. అదనంగా 23 రోజుల వ్యాలిడిటీని పొడిగించింది. జియో యూజర్లు 365 రోజుల ప్లాన్ వ్యాలిడిటీని పొందవచ్చు. అలాగే, జియో ప్రీపెయిడ్ ప్లాన్‌లో 2.5GB రోజువారీ డేటా లిమిట్‌తో912.5GB మొత్తం డేటా కూడా ఉంది. JioTV, JioCinema, JioSecurity, JioCloudతో సహా Jio యాప్‌లకు ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు.

Jio 5G నగరాల్లో ఎక్కడంటే? :
రిలయన్స్ జియో (Jio Welcome Offer) వెల్‌కమ్ ఆఫర్‌ని పొందిన జియో యూజర్లందరూ యాక్టివ్ ప్రీపెయిడ్ లేదా పోస్ట్‌పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను రూ. 239 లేదా అంతకంటే ఎక్కువ కలిగి ఉంటే అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించవచ్చు. జియో ట్రూ 5G సర్వీసుల్లో Jio నెక్స్ట్ జనరేషన్ నెట్‌వర్క్ ఇప్పుడు ఢిల్లీ-NCR, ముంబై, కోల్‌కతా, వారణాసి, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, నాథద్వారా, కొచ్చి, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుమల, అన్ని 33 నగరాల్లో అందుబాటులో ఉంది. గుజరాత్ జిల్లా ప్రధాన కార్యాలయంతో పాటు భోపాల్, ఇండోర్, లక్నో, త్రివేండ్రం, మైసూరు, నాసిక్, ఔరంగాబాద్, చండీగఢ్ ట్రిసిటీలో మొహాలి, పంచకుల, జిరాక్‌పూర్, ఖరార్, దేరాబస్సీ ప్రాంతాలతో సహా 5G సర్వీసులను ప్రారంభించింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 5G ప్లాన్ల పూర్తి లిస్టు మీకోసం.. 5G డేటా పొందాలంటే ఇలా చేయండి!