Maharashtra: పదవీకాలం పూర్తి కాకముందే మహారాష్ట్ర గవర్నర్‭గా తప్పుకున్న కోశ్యారీ

Maharashtra: పదవీకాలం పూర్తి కాకముందే మహారాష్ట్ర గవర్నర్‭గా తప్పుకున్న కోశ్యారీ

Bhagat Singh Koshyari resigns, Ramesh Bais appointed as new Maharashtra Governor

Maharashtra: మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి తప్పుకుంటానని కొద్ది రోజుల క్రితమే ప్రకటించిన భగత్‭సింగ్ కోశ్యారీ.. తాజాగా అధికారికంగా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా, ఆమె ఆమోదించినట్లు రాష్ట్రపతి భవన్ వర్గాలు తెలిపాయి. 2019 నుంచి మహారాష్ట్ర గవర్నర్‭గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన.. అనేక రాజకీయ కాంట్రవర్సీలకు కేంద్ర బిందువుగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి మేలు చేసే విధంగా ప్రవర్తించారని, ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు కూడా బాగానే ఉన్నాయి. ఇక ఛత్రపతి శివాజీ మీద కోశ్యారీ చేసిన వ్యాఖ్యల అనంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారం లేసింది. ఈ కాంట్రవర్సీ కారణంగానే పదవీ కాలం పూర్తి కాకముందే రాజీనామా చేసినట్లు విమర్శకులు అంటున్నారు.

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. సభ ముందుకు ద్రవ్య వినిమయ బిల్లు

కొంత కాలం క్రితమే రాజీనామా సంకేతాలు ఇచ్చిన ఆయన ఆ సమయంలో రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. అందులో.. ‘‘సాధువులు, సంఘ సంస్కర్తలు, వీర యోధుల భూమి అయిన మహారాష్ట్ర వంటి గొప్ప రాష్ట్రానికి రాజ్య పాలకుడిగా పనిచేయడం నాకు దక్కిన గొప్ప గౌరవం. గత మూడు సంవత్సరాల నుంచి మహారాష్ట్ర ప్రజల నుంచి నేను అందుకున్న ప్రేమ, ఆప్యాయతలను ఎప్పటికీ మరచిపోలేను. ప్రధానమంత్రి ఇటీవల ముంబై పర్యటన సందర్భంగా, అన్ని రాజకీయ బాధ్యతల నుంచి తప్పుకుని, నా శేష జీవితాన్ని చదవడం, రాయడం, ఇతర కార్యకలాపాలలో గడపాలన్న కోరికను ఆయనకు తెలియజేసాను. ప్రధానమంత్రి నుంచి ప్రేమ, ఆప్యాయతలను ఇప్పటి వరకు పొందుతూ వచ్చాను. ఈ విషయంలో కూడా అదే విధంగా అందుకోవాలని ఆశిస్తున్నాను’’ అని గవర్నర్ పేర్కొన్నారు.

Bank Robbery : బురఖాలో బ్యాంకుకి వచ్చిన ఇద్దరు.. అసలు విషయం తెలిసి సిబ్బంది షాక్

బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్‭లో కోశ్యారి సీనియర్ నేత. 2019 అసెంబ్లీ ఎన్నికల అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఈయన పదవీ కాలంలో అతిపెద్ద కాంట్రవర్సీ. ఇక ఉద్ధవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘ఉద్ధవ్‭ను సెక్యూలర్ ఎప్పుడు అయ్యావంటూ’ లేఖ రాయడం రాజకీయ విమర్శలకు దారి తీసింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఏక్‭నాథ్ షిండే పడగొట్టినప్పుడు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో గవర్నర్ పాత్ర ఉందంటూ మహా వికాస్ అఘాడి ప్రశ్నించింది. ఇక గత నవంబరులో రాజ్యాం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలను ఐకాన్‌లని చెప్తూ ఛత్రపతి శివాజీ మహారాజ్ ‘పాత ఐకాన్’ అని వ్యాఖ్యానించడం కూడా మహా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపింది. ఇక మహారాష్ట్ర నూతన గవర్నర్ గా రమేష్ బయాస్ ను రాష్ట్రపతి నియమించారు.