Bhim Army chief : భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు సెక్యూరిటీ

భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు సెక్యూరిటీ కల్పించారు. ఇటీవల దేవ్‌బంద్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దాడిలో గాయపడిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వెల్లడించారు....

Bhim Army chief : భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు సెక్యూరిటీ

Bhim Army chief

Bhim Army chief : భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కు సెక్యూరిటీ కల్పించారు. ఇటీవల దేవ్‌బంద్‌లో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌పై కారులో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బుల్లెట్ ఒకటి నడుముకు తగలడంతో అతనికి గాయమైంది. దాడిలో గాయపడిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తుందని ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ వెల్లడించారు. (Chandra Shekhar Aazad to be provided security)

Rajya Sabha seat : బెంగాల్ రాజ్యసభ బీజేపీ సీటు రేసులో సౌరవ్ గంగూలీ, మిథున్‌

చంద్రశేఖర్ తమ మిత్రుడని, అతనిపై జరిగిన దాడి ఘటనపై తాము దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుంటామని డిప్యూటీ సీఎం చెప్పారు. చంద్రశేఖర్ కు భద్రత కల్పిస్తామని పాఠక్ చెప్పారు. ఆజాద్‌పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై హర్యానాలోని అంబాలా జిల్లా నుంచి శనివారం నలుగురిని అరెస్టు చేశారు.

PM Modis US Tour : మోదీ అమెరికా పర్యటనతో గుజరాత్‌కే అధిక ప్రయోజనం…సీఎం భూపేంద్ర పటేల్ వ్యాఖ్యలు

హర్యానా, ఉత్తరప్రదేశ్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వారిని పట్టుకున్నట్లు హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమన్ కుమార్ తెలిపారు. సహరాన్‌పూర్‌లోని జిల్లా ఆసుపత్రి నుంచి చంద్రశేఖర్ గురువారం డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి అయిన చంద్రశేఖర్ కు సాయుధ పోలీసులతో సెక్యూరిటీ కల్పించారు.